YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విదేశీయం

13 మంది మ‌హిళా విద్యార్ధినుల‌ రేపిస్ట్ టీచ‌ర్‌కు జీవితకాల‌ శిక్ష‌

13 మంది మ‌హిళా విద్యార్ధినుల‌ రేపిస్ట్ టీచ‌ర్‌కు జీవితకాల‌ శిక్ష‌

న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 16,
ఇండోనేషియాలో స్కూల్‌ను న‌డుపుతున్న ఓ టీచ‌ర్‌కు జీవితకాల‌ శిక్ష‌ ఖ‌రారైంది. 36 ఏళ్ల హెర్రీ విరావాన్ 13 మంది మ‌హిళా విద్యార్ధినుల‌ను అత్యాచారం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులో ఇవాళ వెస్ట్ జావాలోని బండుంగ్ జిల్లా కోర్టు తీర్పును వెలువ‌రించింది. 11 నుంచి 16 ఏళ్ల మ‌ధ్య‌ ఉన్న అమ్మాయిల‌ను విరావాన్ రేప్ చేశాడు. ఇస్లామిక్ ప్ర‌బోధ‌కుడిగా స్కూల్‌ను న‌డుపుతున్న అత‌ను 2016 నుంచి ఘోరానికి పాల్ప‌డ్డాడు. రేప్‌కు గురైన బాలిక‌ల్లో 8 మంది గ‌ర్భం దాల్చారు. ఆ అమ్మాయిలు 9 మంది చిన్నారుల‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి విరావాన్‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని ప్రాసిక్యూట‌ర్లు కోరారు. ర‌సాయ‌నాల‌తో వృష‌ణాల‌ను నిర్వీర్యం చేయాల‌ని కూడా డిమాండ్ చేశారు. కానీ కోర్టు ఆ డిమాండ్ల‌ను తిర‌స్క‌రించింది. స్కాల‌ర్‌షిప్‌లు ఇస్తామంటూ ఆ టీచర్ అమ్మాయిల‌ను ఆక‌ర్షించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌తి బాధితురాలికి ఇండోనేషియా ప్ర‌భుత్వం ఆరువేల డాల‌ర్లు చెల్లించ‌నున్న‌ది.

Related Posts