YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి

డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి

విశాఖపట్నం
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న డాక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఆన్లైన్లో సీట్లు పొంది ఫీజులు చెల్లించిన విద్యార్థులకు ఆ తర్వాత సీట్లు లేవని చెప్పడాన్ని నిరసిస్తూ కళాశాల గేటు వద్ద ఏఐఎ్సఎఫ్ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఐఎ్సఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, ఫణీంద్రకుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది వీఎస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదట, రెండో విడత కౌన్సెలింగ్లో దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఆన్లైన్లో సీట్లు సాధించి ఫీజులు కూడా చెల్లించారన్నారు. అయితే మూడో విడత ఆన్లైన్ కౌన్సెలింగ్ తర్వాత ముందుగా సీట్లు పొందిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ సీట్లు లేవని చెప్పడం దుర్మార్గమన్నారు. దీనిపై ప్రిన్సిపాల్ను కలిసిన విద్యార్థులతో ఈ ఏడాదికి సీట్లు లేవు, వచ్చే ఏడాది రావాలంటూ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. అందువల్ల ప్రిన్సిపాల్పై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు యథావిదిగా సీట్లు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అభి, జ్యోతి, కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts