YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

సర్కారీ వెంచర్లు...

సర్కారీ వెంచర్లు...

నల్గొండ, ఫిబ్రవరి 19,
నిధుల సమీకరణలో భాగంగా ఎనిమిది జిల్లాల్లో 1092 ప్లాట్ల వేలం ప్రక్రియను రాష్ట్ర సర్కారు ప్రారంభించనున్నది. అందులో భాగంగా కలెక్టర్ల నేతృత్వంలో ఆయా జిల్లాలో శుక్రవారం ప్రీబిడ్‌ సమావేశాన్ని నిర్వహించనున్నది. దీనికి సంబంధించిన ఏర్పాటన్లు ఆయా జిల్లాల యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. మహబూబ్‌నగర్‌, నల్లగొండ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, పెద్దపల్లి, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, వికారాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ సమావేశాలను కలెక్టర్లు నిర్వహించనున్నారు. భూముల వేలానికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇటీవల జారీ అయిన విషయం తెలిసిందే. కనిష్టంగా 60 చదరపు గజాల నుంచి గరిష్టంగా 6,500 చదరపు గజాల వరకున్న 1092 ప్లాట్లకు హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ ద్వారా రాష్ట్ర సర్కారు వేలం ప్రక్రియను నిర్వహించనున్నది. చదరపు గజానికి కనీస ధర రూ.5వేలు ఉండగా గరిష్టంగా రూ.40వేల వరకు ఉంది. వీటికి సంబంధించి రెండు సార్లు ప్రీబిడ్‌ ప్రక్రియను చేపట్టనున్నది. అందులో భాగంగా తొలి ప్రీబిడ్‌ శుక్రవారం జరుగనున్నది. రెండో ప్రీబిడ్‌ మార్చి ఏడో తేదీన జరుగనున్నది. ఈ సమావేశాలు కలెక్టర్ల నేతృత్వంలో జరుగనున్నాయి. మార్చి 14, 15, 16, 17 తేదీల్లో భూముల అమ్మకం కోసం వేలం నిర్వహించనున్నారు. ప్రీబిడ్‌, వేలానికి సంబంధించిన స్థలాలనూ రాష్ట్ర సర్కారు ప్రకటించింది.నల్లగొండ జిల్లాలోని భూముల అమ్మకానికి సంబంధించిన ప్రీబిడ్‌ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లోని ఉదరు ఆదిత్య కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగనున్నది. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన ప్రీబిడ్‌ను గద్వాలలోని జెడ్పీ మీటింగ్‌ హాల్‌(ఓల్డ్‌ ఎమ్పీడీఓ కార్యాలయం)లో చేపట్టనున్నారు. పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్‌లోని మీటింగ్‌ నిర్వహిస్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జెడ్పీమీటింగ్‌ హాల్‌లో ఆదిలాబాద్‌ జిల్లా జెడ్పీమీటింగ్‌ హాల్‌లో, కామారెడ్డి జిల్లాలోని గెలాక్సీ గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో , కొమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లాలో కాగజ్‌నగర్‌లోని వంజిరి రైతువేదికలో, వికారాబాద్‌ జిల్లాలో తాండూరు రెవెన్యూ డివిజన్‌ ఆఫీస్‌లో ప్రీబిడ్‌ సమావేశాలు జరుగనున్నాయి.

Related Posts