YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వివేకా కేసులో పెద్ద తలకాయలు

వివేకా కేసులో పెద్ద తలకాయలు

విజయవాడ, ఫిబ్రవరి 21,
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టిన తర్వాత.. అసలు దోషులు ఎవరో  తెలిసిపోతోందని ప్రపంచమంతా భావించింది. కానీ, వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి.. సీబీఐ ఎదుట చెప్పిన విషయాలు.. ఆ తర్వాత వరుసగా చోటు చేసుకున్న పరిణామాలు అయితే అన్నీ ఇన్నీ కావు. ఇంకా చెప్పాలంటే... బుల్లి తెరలో వచ్చే సీరియల్‌ను మించిపోయి.. ప్రశాంత్ కిషోర్ మార్క్ రాజకీయాన్ని సైతం తలపించిందని టాక్ అయితే తెలుగు వారిలో వైరల్ అయింది. అంతేకాదు ఒకానొక సమయంలో వివేకా హత్య కేసు దర్యాప్తు ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో సైతం చర్చ నడిచింది. దీంతో వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐలో ఏం జరుగుతోందో కానీ.. ఏదో జరుగుతోందనే భావనలోకి తెలుగు ప్రజలు అయితే వెళ్లిపోయారు. ఇటీవల సీబీఐ మాత్రం వివేకా హత్య కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఆ క్రమంలో సీబీఐ దర్యాప్తు కీలక దశకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులోభాగంగా సీబీఐ డీఐజీ చౌరసియా.. కడప చేరుకుని.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులతో సమావేశం అయినట్లు సమాచారం. అంతేకాదు.. వివేకా హత్య కేసులో తాజా అప్ట్ డేట్‌ను సైతం సీబీఐ అధికారులను డీఐజీ అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో నిందితులను ఇటీవల కడప సెంట్రల్ జైల్‌లోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు మరోసారి విచారించారు. అనంతరం పులివెందులలోని రాజారెడ్డి ఆసుపత్రి కాంపౌండర్‌ సైతం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. వివేకా హత్య జరిగిన రోజు... ఆయన మృతదేహానికి కట్లుకట్టడంలో సదరు కాంపౌండర్ పాత్ర కూడా ఉందని.. అందులోభాగంగానే అతడి నుంచి మరిన్ని వివరాల రాబట్టడం కోసం శ్రీనివాసరెడ్డిని సీబీఐ విచారించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే వివేకా హత్య కేసులో చార్జ్ షీట్ దాఖలైనందువల్ల... ఈ హత్యలో పాత్రధారులు ఎవరు.. ఈ హత్య వెనక సూత్రధారులు ఎవరనే విషయంలో సీబీఐ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే సీబీఐ డీఐజీ చౌరసియా.. కడప చేరుకున్నట్లు సమాచారం. కానీ ఈ కేసులో పెద్దతలకాయలను అరెస్ట్ చేస్తే.. శాంతి భద్రతలు సమస్య తలెత్తే ప్రమాదం ఉందని.. అందులోభాగంగానే సీబీఐ డీఐజీ కడప చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై స్థానిక ఉన్నతాధికారులతో కూడా సీబీఐ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు కడపలో ఎప్పుడు ఏటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆందోళనలో ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రంగంలోకి దిగి.. వివేకా హత్య కేసు అంశంపై తాజాగా ప్రెస్ మీట్ పెట్టి.. అటు ఎల్లో మీడియాపై.. ఇటు ప్రతిపక్ష పార్టీలపై ఇంకోవైపు సీబీఐపై విమర్శలు గుప్పించారు. ఇదంతా డైవర్ష్ స్కీమ్‌లో భాగమేననే టాక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Posts