YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఆర్టీసీ కొత్తగా బస్సులు..?

ఆర్టీసీ కొత్తగా బస్సులు..?

హైదరాబాద్, ఫిబ్రవరి 21,
తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే పలు ప్రయోగాలతో ప్రజలకు చేరువైంది. తాజాగా మరో ప్లాన్‌ సిద్ధం చేసింది. ఈ ప్రణాళికతో సేవలు విస్తృతం చేసి, లాభాలు పెంచుకోవచ్చని టీఎస్ఆర్టీసీ భావిస్తోంది. ఆర్టీసీ నష్టాల్లో ఉందని తరుచూ వింటుంటాం. ఆ నష్టాలను పూడ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది ఆర్టీసీ. కానీ ఇప్పటికీ లాభాల బాట పట్టలేదు. ఎండీ సజ్జనార్ సైతం సరికొత్త పంథాతో ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీ మరో ప్లాన్‌ రెడీ చేసింది. అదే కొత్త బస్సుల ప్లాన్. తెలంగాణలో త్వరలో కొత్త బస్సులు తిరగనున్నాయి. దీనికి సంబంధించి ప్రతిపాదనను ఆర్టీసీ సిద్ధం చేస్తోంది. కొత్త పంథాలో ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్న ఆర్టీసీ , ప్రజలను ఆకట్టుకునేందుకు టెక్నాలజీని వాడుతుంది. ఇందులో భాగంగానే కొత్త బస్సులను కొనేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తుంది. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఆర్టీసీ అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది.మేడారం జాతర కూడా అందులో భాగమే. గతం కంటే ఎక్కువగా బస్సులను మేడారానికి నడిపింది తెలంగాణ ఆర్టీసీ. దాదాపు 3వేల 800 బస్సుల్లో దాదాపు18 లక్షల మందిని మేడారానికి చేరవేసింది. మొక్కులు చెల్లించలేని వారికోసం కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను క్రియేట్ చేసి అందుబాటులోకి తెచ్చింది. కానీ ఆశించిన ఫలితం రాలేదన్నారు తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్. గతంలో జరిగిన మేడారం జాతరతో ఆర్టీసీకి 38 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, ఇప్పుడు మాత్రం ఆదాయం తగ్గింది అని ప్రాథమిక అంచనా. అందుకే తెలంగాణ ఆర్టీసీ ఎదుగుదల కోసం ప్రభుత్వానికి పంపడానికి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు బాజిరెడ్డి.2 వేల 820 బస్సులు కొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు వివరించనున్నట్టు వెల్లడించారు గోవర్థన్‌రెడ్డి. అలాగే, మృతిచెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకం ద్వారా, ఉద్యోగం కల్పించే అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారాయన. అటు రిటైర్మెంట్‌ బెనిఫిట్లకు కూడా 500 కోట్లు ప్రభుత్వం సాయం చేయాలని ఆర్టీసీ ఛైర్మన్ కోరనున్నారు.

Related Posts