YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్!

కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఏ పార్టీ అధికారిలోకి వస్తుందనే విషయమై జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నట్టు సమాచారం. ఒకవైపు కర్ణాటక ఎన్నికల్లో హంగ్‌ తప్పదని ఎగ్జిట్‌ పోళ్లన్నీ చెబుతుంటే బెట్టింగ్ కు రాయుళ్లు తమ వాహనాలు, భూములు, నగదు, ఆస్తులను పణంగా పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో తుముకూరు, మంగళూరు, బెంగళూరు, మాండ్యా, రామ్ నగర్ జిల్లా కేంద్రంగా ఈ దందా సాగుతోంది. ముఖ్యంగా కీలక అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడనే విషయమై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నట్టు తెలుస్తోంది. బెంగళూరు సిటీతో పాటు బదామి, చాముండేశ్వర, బాగేపల్లి, పావగడ, మధుగిరి, చామరాజ్ నగర్ నియోజకవర్గాలపై అందరి దృష్టి ఉంది. గత రాత్రి నుంచే బెట్టింగ్ వ్యవహారం ఊపందుకుంది. బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకునే నిమిత్తం ప్రత్యేక పోలీస్ బృందాలు నిఘా ఏర్పాటు చేసినట్టు సమాచారం. కేవలం కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. కాగా, బదామి నుంచి సీఎం సిద్ధరామయ్య, బీజేపీ నేత శ్రీరాములు, జేడీఎస్ నేత హనుమప్ప పోటీ చేశారు. ఈ ముగ్గురిలో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై జోరుగా బెట్టింగ్ జరుగుతోందట. అదేవిధంగా, చాముండేశ్వరి నియోజకవర్గంలో సిద్ధరామయ్య ఓడిపోతారనే వదంతుల నేపథ్యంలో అక్కడ కూడా జోరుగా బెట్టింగ్ కు పాల్పడుతున్నారు. బళ్లారి అర్బన్, రూరల్ లో కూడా బెట్టింగ్ బాగా జరుగుతోందని పోలీసుల సమాచారం.

కర్ణాటకలో హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో జేడీఎస్ అభ్యర్థులపై అత్యధికంగా బెట్టింగ్ జరుగుతోంది. ముఖ్యంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకని బెట్టింగ్ రాయుళ్లు తమ పందేలు కాస్తున్నట్టు సమాచారం. స్థానికంగా సదరు నేత ఏ పార్టీకి చెందిన వాడు, ఆ నేతకు ఉన్న ప్రజాదరణ, పోలింగ్ బూత్ స్థాయిలో జరిగిన ఓటింగ్ శాతాన్ని ఆధారంగా చేసుకుని బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు. 

Related Posts