YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న శిల్ప అనుపాటి

దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న శిల్ప అనుపాటి
దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న షిరిడీ సాయి గ్లోబల్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ శిల్ప అనుపాటి
చిత్రసీమ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జాతీయ పురస్కారం అందుకున్నారు...షిరిడి సాయి గ్లోబల్ ట్రస్ట్ ఛైర్మెన్ శిల్పా అనుపాటి ."మనసానమః "చిత్రానికి 2022 సంవత్సరానికి గాను ఉత్తమ లఘుచిత్ర నిర్మాతగా  దాదా సాహెబ్ పాల్కే అవార్డును నిన్నటి రోజు ముంబైలో జరిగిన అవార్డు ఫంక్షన్ లో దాదా సాహెబ్ పాల్కే అవార్డు జ్యూరీ సభ్యుల చేతుల మీదుగా  అందుకున్నారు.ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ మొదటి నామినేషన్ లో కూడా ఎన్నికై తెలుగు లఘు చిత్రం యొక్క ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి ఇప్పటికి 900 కు పైగా అవార్డులు కైవసం చేసుకున్న గొప్ప లఘుచిత్రం "మనసానమః" ఈ చిత్రాన్ని కన్నడ లోను ,తమిళం లోనూ డబ్బింగ్ చేసారు.ఎన్నో సామాజిక  సేవా కార్యక్రమాలద్వారా ఎందరినో ఆదుకొని ఒక సామాజిక సేవకురాలుగా లబ్దప్రతిష్ట పొందిన శిల్పా మేడమ్ నిన్నటి రోజు దాదా సాహేబ్ పాల్కే అవార్డు అందుకొని సినిమా చిత్ర రంగంలో ప్రవేసించారు.మున్ముందు సామాజకి జపయోగ కరమైన చిత్రాలను నిర్మించి,మెరుగైన సమాజ నిర్మాణం కోసం పాటుపడుతారని మనసారా ఆశిస్తూ వేకువ సేవా సంస్థ హృదయ పూర్వకంగా శుభా కాంక్షలు తెలియ జేస్తోంది.

Related Posts