YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వివేకాహత్యకేసు దర్యాప్తుచేస్తున్న సీబీఐ అధికారుల ప్రాణాలకు రక్షణలేదు

వివేకాహత్యకేసు దర్యాప్తుచేస్తున్న సీబీఐ అధికారుల ప్రాణాలకు రక్షణలేదు

అమరావతి
దేశంలో ఎక్కడాలేని అధికార దుర్వినియోగం, రాజ్యాంగవ్యవస్థల పై నిరంతరం దాడిజరగడం ఏపీలోనే చూస్తున్నామని, సొంత బాబాయ్ హత్యకేసులోని నిందితులను కాపాడటానికి స్వయంగా జగన్మోహన్ రెడ్డే ప్రయత్నించడం చూస్తుంటే, భారతదేశమే నివ్వెర పోతోందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీశానసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.  
బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. వివేకా హత్యకేసుని సీబీఐ చేధిస్తున్న తరుణంలో, నిందితులను ఒక్కొక్కరిగా బయటకులాగుతున్న సమయంలో, అధికారం చేతిలో ఉందికదా అని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డే  విచారణసంస్థ సీబీఐపై తప్పుడుకేసులు పెట్టించడం దుర్మార్గం. సీబీఐవిచారణ సంస్థకు దేశంలోనే చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాంటి సీబీఐని బ్లాక్ మెయిల్ చేసేక్రమంలోనే వైసీపీ వారితో వివేకా హత్యకేసు విచారణలో కీలకంగా వ్యవహరిస్తున్న అధికారులపై   తప్పుడుకేసులు పెట్టిస్తున్నారు.  కడప పోలీస్ స్టేష న్లో సీబీఐ అధికారులపై ఎఫ్ఐఆర్ 29 / 2022 నమోదుచేసి, ఐపీసీ సెక్షన్ 195, 323, 506, రెడ్ విత్ 34కేసులు పెట్టారు. సీబీఐ ఏసీబీ రాం సింగ్ పై ఏపీలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టింది. వివేకా హత్యకేసులోని సూత్రధారులు, పాత్రధారుల భర తం పట్టేలా రాంసింగ్ సీబీఐ విచారణను వేగవంతంచేశాడన్న అక్క సుతోనే ముఖ్యమంత్రి తన అధికారంబలంతో అతడిని ఇబ్బందుల కు గురిచేస్తున్నాడు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సొంత చిన్నాన్నను చంపినవారిని పట్టుకోలేని అసమర్థుడు, చివరకు దోషులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నవారిపై తప్పుడుకేసులు పెట్టడం సిగ్గుచేటు. ఈ  ముఖ్యమంత్రి ఎంతటి దుర్మార్గుడో, అధికారాన్నిఎంత దారుణంగా రాజ్యాంగవిరుద్ధంగా వినియోగిస్తాడో  జరుగుతున్న ఘటనలే నిద ర్శనం. రాంసింగ్ ప్రాణాలకు ఏపీలో హాని ఉందనే వాస్తవాన్ని ఢిల్లీ లోని సీబీఐ అధికారులు గుర్తించాలనికోరుతున్నాం.  రాంసింగ్ కు ఎప్పుడు,  ఏసమయంలో ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేమ ని విన్నవిస్తున్నాం.
ఇక ఇదేకేసులో ప్రధానవ్యక్తిగా గజ్జల ఉదయకుమార్ రెడ్డి వ్యవ  హరించారు. వివేకా మరణించినప్పడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి మృతదేహాంపై ఉన్నరక్తపుమరకలు తుడిచేసి, కుట్లుకట్టాడు. అతను జగన్మోహన్ రెడ్డి భార్య భారతి తండ్రిగారైన గంగిరెడ్డి ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేసేవాడు. హత్యజరిగినప్పుడు అవినాశ్ రెడ్డి పిలవగానే గంగిరెడ్డి ఆసుపత్రినుంచి వచ్చిన ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి, వివేకామృతదేహానికి కుట్లువేశాడు.
ఈ ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా తనతండ్రి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా పరిగణించి విచారించాలని గతంలోనే వివేకాకుమార్తె డాక్టర్ సునీత హైకోర్ట్ లో వేసిన రిట్ పిటిషన్లో కోరడం జరిగింది. సదరు ఉదయ్ కుమార్ రెడ్డిని గతంలో టీడీపీ ప్రభుత్వంలో సిట్ అధికారులుకూడా విచారించడం జరిగింది. ఆనాడు సిట్ విచారణ జరుగుతున్న సమయంలోనే సదరుబృందంలో అధికారిగాఉన్న అభిషేక్ మహంతి, ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళు తుంటే, తాడేపల్లి ప్యాలెస్ నుంచి అతన్ని వదిలేయాలని ఆదేశా లు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేత్రత్వంలో ఉన్న సిట్ ను, విచారణాధికారులను పదేపదే మారుస్తూ, ఎస్పీస్థాయికి దిగజార్చింది.  
వివేకాహత్యగావింపబడిన తర్వాత మొట్టమొదట మృతుడి ఇంటిలోకి వెళ్లింది ఇప్పుడు కడపఎంపీగా ఉన్న వై.ఎస్. అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వెళ్లారని, ఆనాడు ఘటనాస్థలానికి వెళ్లిన సీఐ శంకరయ్య చెప్పారు.
వివేకాఇంటిలోకి వెళ్లిన ఆ ముగ్గురు ఘటనాస్థలంలోని ఆధారాల ను వారే చెరిపేశారనికూడా సదరుసీఐ చెప్పారు. అవినాశ్ రెడ్డే తనకు స్వయంగా ఫోన్ చేసి, వివేకానందరెడ్డి గుండెపోటుతో చని పోయాడని, కాబట్టి అక్కడకువచ్చే ఆయన అభిమానులను నియంత్రించాలని తనకుచెప్పాడనికూడా సీఐ చెప్పడం జరిగింది. హత్యజరిగినప్పుడు దగ్గరుండి ఆధారాలు తుడిచేయించడం, వివేకామాజీ డ్రైవర్ దస్తగిరి సీబీఐకి ఇచ్చినవాంగ్మూలంలో తనను అవినాశ్ రెడ్డి ఎలా ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడో వివరించడం చూశాక అసలుదోషులెవరో తేటతెల్లమవుతోంది.  2019 మార్చి 15 రాత్రంతా హత్యకు సంబంధించిన ప్రణాళికను అవినాశ్ రెడ్డే పర్యవేక్షించాడు. వివేకామరణించాడని తెలియగానే తెల్లారే 6 గంట లకు అవినాశ్ రెడ్డి తన అనుచరులతో మృతుడి ఇంటికెళ్లి, ఆధారా లు లేకుండా చేయడానికి ప్రయత్నించాడు. ఆనక సీబీఐ విచారణ లో దస్తగిరి అప్రూవర్ గా మారగానే అతన్ని లొంగదీసుకోవడానికి సామ, దాన, బేధ, దండోపాయాలను అవినాశ్ రెడ్డి ఉపయోగించడం చూశాకకూడా అతనిప్రమేయంలేదని ప్రభుత్వపెద్దలు ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నాం?  దస్తగిరి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం చూశాక, అతను తనప్రాణరక్షణ గురించి భయపడుతున్న తీరు చూశాక, అతన్నికూడా మొద్దుశీనుమాదిరే చంపేస్తారేమోనన్న అనుమానం అందరిలోనూ కలుగుతోంది.
వివేకాహత్యకేసు విచారణను చేధిస్తున్న సీబీఐపై కూడా బరితెగించే స్థితికి ఈప్రభుత్వం వచ్చిందంటే, అదంతా ఎందుకోసం, ఎవరిని కాపాడటకోసం చేస్తున్నదో ఆలోచించాలి.
వివేకాహత్యకేసులో సూత్రధారిగా వై.ఎస్.అవినాశ్ రెడ్డి వ్యవహరిస్తే, ఆసూత్రధారిని తాడేపల్లి టీమ్ ఆడించడంజరిగింది. సొంత చిన్నాన్న హత్యకేసులో సీబీఐ అసలు వాస్తవాలు బహిర్గతంచేశాక కూడా ముఖ్యమంత్రి ఎందుకు నోరుమెదపకుండా, ఇప్పటికీ తన అధికారాన్ని ఉపయోగించి, నిందితులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడో చెప్పాలి. ఏపీ పోలీస్ శాఖ సాయంతో వివేకాహత్యకేసు విచారిస్తున్న సీబీఐ అధికారుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నారో సమాధానంచెప్పాలి . గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నప్పుడు, ఆమెపైవచ్చిన ఆరోపణలకు సంబంధించిన విచారణను ఆరాష్ట్రంలో కాకుండా సీబీఐ కర్ణాటకనుంచి కొనసాగించింది. అదేవిధంగా నేడు ఏపీలో వివేకాహత్యకేసుని విచారిస్తున్న సీబీఐ అధికారులకు కూడా ప్రాణహాని ఉంది. వారికి ఏక్షణంలో ఏమైనా జరగొచ్చని ఢిల్లీలోని సీబీఐ కార్యాలయాన్ని హెచ్చరిస్తున్నాం.
వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయాన్ని, పాత్రను ఆపడానికే ఏపీప్రభుత్వం చివరకు సీబీఐ అధికారులపై ఉదయ్ కుమార్ రెడ్డితో తప్పడుకేసులుపెట్టించే స్థాయికి వచ్చింది.
వివేకాహత్యకు ప్రణాళికలు వేసి, ఏరాత్రి అయితే ఆయన్ని హతమార్చాలని చూశారో, ఆరాత్రి అవినాశ్ రెడ్డికి నిద్రకూడాపట్టలేదు. హత్య జరిగిందని రూఢీచేసుకున్నాకే, అతనుఏమీ తెలియనట్లు తెల్లారక మృతుడైన వివేకాఇంటికెళ్లాడు. ఇవన్నీ ఏపీప్రభుత్వాధినేతలకు తెలుసుకాబట్టే, రాష్ట్రంలో వివేకాహత్యకేసులో అసలు సిసలు జగన్నాటకం మొదలైంది. సీబీఐ ఏసీబీఅధికారిపై సాధారణ పోలీసులు ఎవరైనా కేసులు నమోదుచేస్తారా? అదికూడా వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్నవ్యక్తి ఫిర్యాదుచేస్తే కేసుకడతారా? ఈరాష్ట్రంలో మాత్రమే ఇలాంటి చోద్యాలు జరుగుతున్నాయి.
వివేకాహత్యకేసులో నిన్నటివరకు తాము బాధితులమని చెప్పిన వారు, ఇప్పుడు నిందితులని తేలిపోయింది. దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్, గతంలో సీఐ శంకరయ్యచెప్పిన అంశాలు, ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ అధికారిపై ఫిర్యాదుచేయడం చూస్తుంటే, బాధి తులే నిందితులని స్పష్టమవుతోంది.  
వివేకాహత్యకోసం ఏకంగా రూ.40కోట్లు ఇచ్చేస్థాయి ఎవరికుందో.. అవినాశ్ రెడ్డి ఇచ్చాడా.. అతనికి ఎవరైనా ఆర్థికసాయం చేశారా.. చేస్తే ఎవరుచేశారనే అంశాలపై కూడా సీబీఐ విచారించాలని డిమాండ్ చేస్తున్నాం. అలానే వివేకా హత్యజరిగినప్పుడు ఎందుకు మృత దేహానికి కుట్లువేయించారు.. మృతుడికుటుంబసభ్యులు వచ్చేలోపే దహనసంస్కారాలు చేయాలని ఎందుకు ప్రయత్నించారనే అంశాలపై కూడా సీబీఐ దృష్టిసారించాలి. వివేకాహత్యజరిగిన రాత్రి ఒకవ్యక్తి మృతుడి ఇంట్లోనుంచి వస్తుంటే చూశానని, అప్పుడు వాచ్ మెన్ గా ఉన్నరంగయ్య చెప్పాడు. ఆవ్యక్తి ఎవరోకూడా సీబీఐ కనిపెట్టాలని కోరుతున్నాం.  ఇలా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్న అనేక అంశాలపై సీబీఐ దృష్టిపెడితే, వివేకాహత్యకేసు లోని సూత్రధారులు, పాత్రధారులు ఆటకట్టించడం సాధ్యమవుతుందని స్పష్టంచేస్తున్నాం. నిజాలు నిగ్గుతేలేవరకు ప్రధానప్రతి పక్షస్థానంలో ఉన్న టీడీపీ వదిలిపెట్టదని తేల్చిచెబుతున్నాం.
ఏపీ పోలీస్ వ్యవస్థ వివేకాహత్యకేసులో సీబీఐకి సహకరించకుండా తాడేపల్లినుంచి వచ్చే ఆదేశాలప్రకారమే నడుచుకుంటోంది. చిన్నప్పటినుంచి తనను ఎత్తుకొని పెంచిన, తండ్రితరువాత  తండ్రైన వ్యక్తిని చంపినవారిని, స్వయంగా రక్తసంబంధీకులే  కాపాడటానికి ప్రయత్నించడం బాధాకరం.  వివేకాహత్యజరిగిందని తెలిసిన వెంటనే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుగారు  విమానంలో హుటాహుటిన బయలుదేరి రాష్ట్రానికి వస్తే, మృతుడి అన్నకుమారుడైన జగన్మోహన్ రెడ్డి మాత్రం తాపీగా హైదరాబాద్ నుంచి కడపకు రోడ్డుమార్గంలో వెళ్లాడు. బాబాయ్  హత్యగురించి తెలిశాక కూడా, జగన్మోహన్ రెడ్డి ఎందుకంత నింపాదిగా ఆచితూచి వ్యవహరించి, అప్పుడు అధికారంలోఉన్నవారిపై నింద లేసి, తన రాజకీయపబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించాడనే దానిపైకూడా సీబీఐ నిఘాపెట్టాలని కోరుతున్నామని అన్నారు. 

Related Posts