YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ

2022 నేషనల్ బెస్ట్ సింగర్ అవార్డుకు బొల్ల జయలక్ష్మి ఎంపిక

2022 నేషనల్ బెస్ట్ సింగర్ అవార్డుకు బొల్ల జయలక్ష్మి ఎంపిక

హైదరాబాద్ ఫిబ్రవరి 26
నేషనల్ అవార్డు 2022 సంవత్సరానికి బెస్ట్ సింగర్ గా బొల్ల జయలక్ష్మి ఎంపికైనారు. ఈ మేరకు బహుజన సాహితీ అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ వెల్లడించారు.అవార్డ్ కమిటీ చైర్మన్ నల్ల రాధాకృష్ణ బొల్ల జయలక్ష్మికి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సి ఎస్సి బిసి మైనారిటీ సాహిత్యాన్ని ముందుకు తీసుకోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ ఎంతో కృషి చేస్తుందని ఇందుకు ప్రతి ఏటా ప్రజా ఉద్యమ కారులకు సంఘ సేవకులకు రచయితలకు కవులకు ఈ అవార్డులను ప్రధాన చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 13 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జరిగే సౌత్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ లో విజయలక్ష్మికి నేషనల్ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ తాను వివిధ కచేరీల ద్వారా ఆలపిస్తున్న గానాన్ని,పాటలను గుర్తించి తనకు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ బెస్ట్ సింగర్ అవార్డుకు  ఎంపిక చేయడం  తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు.

Related Posts