YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఏపీ, తెలంగాణ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్

ఏపీ, తెలంగాణ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్

విజయవాడ, మార్చి 3,
ఏపీ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా ఇంటర్ ఎగ్జామ్స్‌ను పోస్ట్‌పోన్ చేశామని ఆయన అన్నారు. ఇక రిలీజ్ చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్రంలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12 తేదీ వరకు జరగనున్నాయి. ఫస్టియర్ పరీక్షలు ఏప్రిల్ 22, 25, 27, 29, మే 2, 6, 9, 11 తేదీల్లో జరగనుండగా.. సెకండియర్ పరీక్షలు ఏప్రిల్ 23, 26, 28, 30, మే 05, 07, 10, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం గతంలో ప్రకటించినట్టుగానే మార్చి 11 తేదీ నుంచి మార్చి 31 వరకు జరగనున్నాయి. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలను నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంటర్ బోర్డు తరపున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. మొత్తం 1400 కేంద్రాలలో పరీక్షలు జరగనుండగా.. ల్యాబ్ ఎగ్జామ్స్ 900 కేంద్రాల్లో జరుగుతాయి.

హైదరాబాద్,
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 21న జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు మార్చాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. అటు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు.. ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు జరపనున్నారు.ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్: ఏప్రిల్ 22న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1, ఏప్రిల్ 25న, ఇంగ్లీష్ పేపర్-1, 27న మ్యాథమెటిక్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1, 29న మేథమెటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, మే 2న ఫిజిక్స్ పేపర్-1, అర్థశాస్త్రం పేపర్-1, మే 6న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, మే 9న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు), మే 11న మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1 పరీక్షలు జరగనున్నాయి.ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్: ఏప్రిల్ 23న 2nd లాంగ్వేజ్ పేపర్-2, 26న ఇంగ్లీష్ పేపర్-2, 28న మ్యాథమెటిక్స్ పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2, 30న మ్యాథమెటిక్స్ పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2, మే 5న ఫిజిక్స్ పేపర్-2, అర్థశాస్త్రం పేపర్-2, మే 7న కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ -2, మే 10న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు), మే 12న మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్-2 పరీక్షలను నిర్వహించనున్నారు.

Related Posts