YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మైసూరులోనే జేడీఎస్

మైసూరులోనే జేడీఎస్

కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యం దిశగా సాగిపోయింది. ఎవరు మద్దతు లేకుండా సాధారణ మెజార్టీకి చేరువుగా బీజేపీ సాగింది. కనీసం జేడీఎస్ మద్దతుతోనైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించిన పార్టీ ఆశలపై కన్నడిగులు నీళ్లు కుమ్మరించారు. ఒక్క బెంగళూరు పరిధిలో మినహా మరెక్కడా కాంగ్రెస్ కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తున్న వేళ, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి జేడీఎస్ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి కాషాయదళం చేరింది అంచనా. మొత్తం 222 స్థానాల్లో 114 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ 64 స్థానాల్లో, జేడీఎస్ 44 చోట్ల, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మధ్య కర్ణాటకలోని 35 నియోజకవర్గాల్లో బీజేపీ 23 స్థానాల్లో ఆధిక్యతలో సాగుతోంది. బెంగళూరు నగరంలోని 31 స్థానాల్లో బీజేపీ 15 చోట్ల ముందజలో ఉంది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతలోని 31 స్థానాల్లో 16 చోట్ల కమలదళం సత్తా చాటుతోంది. కోస్టల్ కర్ణాటకలోని 21 స్థానాల్లో 16 చోట్ల, ముంబై కర్ణాటకలో 50 స్థానాల్లో 30 చోట్ల బీజేపీ గెలుపు దిశగా సాగుతోంది. పాత మైసూరు ప్రాంతంలో జేడీఎస్ తన పట్టునిలుపుకుంది. ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆనందంతో సంబరాలు ప్రారంభించారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల సరళిని పరిశీలిస్తుంటే, అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.  ఇటు బళ్లారిలో ర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగిన గాలి జనార్దన్‌రెడ్డి సోదరులు బళ్లారి బెల్ట్‌లో ముందంజలో ఉన్నారు. ఊహించినట్టుగానే తమకు గట్టి పట్టున్న బళ్లారి ప్రాంతంలో గాలి సోదరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బళ్లారి నియోజకవర్గంలో గాలిసోమశేఖరరెడ్డి ముందంజలో ఉండగా.. హరప్పనహళిలో గాలి కరుణాకరరెడ్డి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. గాలి సోదరులు సన్నిహితుడు శ్రీరాములు కూడా బాదామిలో సీఎం సిద్దరామయ్యకు గట్టిపోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీరాములుపై సిద్దరామయ్య స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో నియోజకవర్గం మొలుకాల్మూరులోనూ బరిలోకి దిగిన శ్రీరాములు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి బీజేపీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేవిధంగా లెక్కింపులో గాలి సోదరులు ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక శ్రీరాములు మాట్లాడుతూ.. గాలి జనార్దన్‌రెడ్డి తనకు స్నేహితుడు మాత్రేమేనని, ప్రస్తుత ఎన్నికలతో ఆయనకు సంబంధం లేదని చెప్పారు

Related Posts