YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

ఓయూలో సంబరాలు

ఓయూలో సంబరాలు

హైదరాబాద్
సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 91 వేల ఉద్యోగాలు ప్రకటించడంతో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఉద్యోగుల ప్రకటనను స్వాగతిస్తూ టిఆర్ఎస్వి, టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ను బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకు వెళ్తున్న కేసీఆర్ కు విద్యార్థులు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలని 315 జీవోను ప్రవేశపెట్టి దాన్ని అమలు చేస్తూ ప్రకటన విడుదల చేయడం తద్వారా ఎస్సీ ఎస్టీ బిసి నిరుద్యోగులకు 10 సంవత్సరాల వయోపరిమితి పెంచడం హర్షణీయం అని తెలియజేశారు.

కేసీఆర్ చిత్రపాటానికి పాలాభిషేకం
సోమాజిగూడ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం జరిగింది. అసెంబ్లీలో సుమారు 92 వేలకు పైగా ఉద్యోగ ప్రకటించినందుకు  సోమాజిగూడ టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారిపై మానవహారంగా ఏర్పడి పాలాభిషేకం నిర్వహించారు. అసెంబ్లీలో ప్రసంగం ముగించుకుని ముఖ్యమంత్రి కాన్వాయ్ సోమాజిగూడ చౌరస్తా మీదుగా వెళ్తున్న సమయంలో జై కేసీఆర్ జై కేటీఆర్ అంటూ నినాదాలు పాలాభిషేకం చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అభివాదం చేశారు.

Related Posts