YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు మంత్రి నిరంజన్ రెడ్డి

20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్
తెలంగాణ  రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి  సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని మంత్రి వెల్లడించారు.  కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు నిమిత్తమై 10 లక్షల 90 వేల ఎకరాలను అనువైన ప్రాంతంగా సూచించింది. పంట మార్పిడి విధానంలో భాగంగా భారీ స్థాయిలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కేంద్రం సూచించిన దానితో పాటు అదనంగా 20 లక్షల ఎకరాల్లో ఈ సాగును విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ నర్సరీలు, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆయిల్ పామ్ సాగు నిమిత్తం రైతుల్లో చైతన్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి  తెలిపారు.
ఉద్యాన శాఖ నుంచి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆయిల్ పామ్ తోటల సందర్శనతో పాటు సాగు, ఆదాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సాగు చేసిన 4వ ఏడాది నుంచి మనకు పంట చేతికొస్తుందన్నారు. ఈ మూడేండ్ల కాలంలో అంతర పంటలను సాగు చేసుకోవచ్చు. ఒక మొక్కను నాటే కంటే ముందు 16 నెలల పాటు ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

Related Posts