YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జల్ జీవన్ మిషన్ పథకాన్ని శంకుస్థాపన చేసిన సర్పంచ్ కురడ బోయిన సుబద్ర

జల్ జీవన్ మిషన్ పథకాన్ని శంకుస్థాపన చేసిన సర్పంచ్ కురడ బోయిన సుబద్ర

విశాఖపట్నం
అరకులోయ మండలంలోని చొంపి పంచాయతీ పప్పుడు వలస గ్రామంలో జల్ జీవన్ మిషన్ పథకాన్ని చొంపి పంచాయతీ సర్పంచ్ కురడబోయిన సుభద్ర భర్త జీనబందు, తెలుగు దేశం పార్టీ చొంపి,శిరగం సెగ్మెంట్ ఎంపిటీసి సభ్యురాలు సోమెలి జానకి భర్త బాలు, ఆధ్వర్యంలో పప్పుడు వలస గ్రామంలో రక్షిత మంచినీటి సదుపాయం కోసం పైపు లైన్ కాలువలు త్రవ్వడం కొరకు ఇరువురు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ పథకం మన గిరిజన ప్రాంతం అయిన పప్పుడు వలస గ్రామంలో  ప్రతి గడగడపకు కొలాయి కనెక్షన్ లు ఇవ్వడం జరిగింది ఈ పథకం ద్వారా త్రాగు నీటి సదుపాయం కల్పించడంపై పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ హర్షం వ్యక్తంచేశారు.ఈ పథకం 6 లక్షల 10 వేల రూపాయలు నిధులతో నిర్మాణం చేపట్టనున్నారు. గిరిజన ప్రాంతంలో చాలా గ్రామాల్లో మంచినీటి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాంలో ఏ ఏ గ్రామాలకు మంచి నీటి సమస్య ఉందో ఆయా గ్రామాలకు జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా రక్షిత మంచినీటి సదుపాయం కల్పించడం గ్రామ ప్రజలకు త్రాగు నీటి కష్టాలు తీరుతుందని  భావిస్తున్నామని దూర ప్రాంతం కు వెళ్లి మంచి నీరు తీసుకురావడం మహిళలకు కష్టాలు తప్పుతుందని  అన్నారు.వేసవి కాలం సమీపిస్తుండంతో దాని దృష్టి లో ఉంచుకొని ఈ పథకం త్వరితగతిన పూర్తి చేసి గిరిజన ప్రజలకు త్రాగు నీటి సదుపాయం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ తెలుగు దేశం పార్టీ యువత కార్యదర్శి సోమెలి బాలు, డీసీఎంసీ మార్కెటింగ్ మెంబర్ శుక్రయ, వార్డు సభ్యులు సాగరజన్ని రాము, గుడివాడ సన్యాసమ్మ,రొశరబోయిన రాంబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Posts