YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఆసాంఘీక కార్యాకలాపాలకు అడ్డా

ఆసాంఘీక కార్యాకలాపాలకు అడ్డా

కాకినాడ, మార్చి 15,
అందాలకు చిరునామా పచ్చని కోనసీమ. ఒక ప్రక్క కొబ్బరి చెట్ల అందాల హరివిల్లులు మరో ప్రక్క ఆకుపచ్చని సుందరమైన వరి చేలు వాటి ప్రక్కనే అక్కడ అక్కడ వైనతేయ నదీ  జలపాతాలు. అటువంటి సుందర నదీ తీరమున ఆరేళ్ల క్రితం 6 కోట్ల రూపాయల వ్యయంతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దిన ఏపీ టూరిజం భవనాలు, గోదావరిలో నిర్మించిన సుందరమైన చెక్క వంతెనలు. 6 ఏళ్లుగా ఓపినింగ్ నోచుకోక కూలుతున్న సుందరమైన చెక్క వంతెనలు రాత్రి అయితే చాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారి మందుబాబులు ఆగడాలు. కళ్లెదుటే 6 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన భవనాలు, తుప్పు పడుతున్న పర్యాటక బోట్లు, కూలుతున్న చెక్క వంతెనలు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులకు వెళ్ళడానికి వీలు లేకుండా అడ్డుగా వలలు కట్టడంతో ఇక్కడి పరిస్థితిని చూసి గత ఆరేళ్లుగా విస్మయానికి గురవుతున్న పర్యాటకులుతూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రు, పాశర్లపూడి వైనతేయి నదీ తీరమున సుమారు 6 కోట్ల వ్యయంతో ఆరు సంవత్సరాల క్రితం అతి సుందరంగా నిర్మాణం చేపట్టిన ఈ భవనాలు ఇప్పటివరకు ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడం సుదూర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులకు, కోనసీమ ప్రజలకు అందరి ద్రాక్షగా ఉందని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ అందాలను వీక్షించడానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే పర్యాటకులు సరదాగా బోటు షికారు చేయడానికి అత్యాధునికమైన బోట్లను ఏర్పాటు చేసినప్పటికీ అవి తుప్పు పట్టి శిధిలమై పోతున్నాయి. మరో ప్రక్క ఆదుర్రు బౌద్ధ స్థూపం వద్ద గోదావరి నదిలో అతి సుందరంగా కర్రల వంతెన నిర్మాణం చేశారు. ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుని కూల్ పోతుండటంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి.. నిర్మించిన ఈ భవనాలను, బోట్లను ప్రభుత్వం గాలికి వదిలేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాశర్లపూడి నుండి ఆదుర్రు బౌద్ధ స్తూపం వద్దకు నాలుగు కిలోమీటర్లు, ఇటు పాశర్లపూడి నుండి అప్పనపల్లి 5 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ క్షేత్రాలను గోదావరి మార్గం ద్వారా పర్యాటకులు చేరుకుంటారని ఉద్దేశంతో అప్పటి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా యుద్ధప్రాతిపదికన భవనాలు, బోట్లు ఏర్పాటు చేశారు. ఎంతో సుందరంగా పర్యాటకులతో సందడిగా ఉండవలసిన ఈ ప్రదేశం చీకటి పడితే చాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారి మందుబాబులు ఆగడాలు అంతే లేకుండా పోతుంది. ఈ టూరిజం ప్రదేశానికి 6 కిలోమీటర్లు దూరంలోనే అమలాపురం కోనసీమ జిల్లా రాజదానిగా రాబోతున్న తరుణంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆహ్లాదకరమైన అందమైన ఈ సుందర ప్రదేశాన్ని పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా తయారు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Related Posts