YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సైకిల్ తో పొత్తుకు క్లారిటీ...

సైకిల్ తో పొత్తుకు క్లారిటీ...

విజయవాడ, మార్చి 15,
జన‌సేనాని బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. పార్టీ ఆవిర్భావ స‌భ‌లో భ‌విష్య‌త్ రాజ‌కీయ వ్యూహాన్ని రివీల్ చేశారు. పొత్తుల‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీ మ‌హిషానికి కొమ్ములు ఇర‌గ్గొట్టి గ‌ద్దె దించుతామ‌ని తేల్చి చెప్పారు. "వైసీపీ వ్య‌తిరేక ఓటు చీల్చే ప్ర‌స‌క్తే లేదు.. రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం ఎన్నిక‌ల స‌మ‌యంలో పొత్తుల గురించి ఆలోచిస్తాం" అని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇదేమీ మామూలు ప్ర‌క‌ట‌న కాదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వాన్ని తారుమారు చేసే సంచ‌ల‌న వ్యూహం. టీడీపీతో ప‌క్కాగా పొత్తు ఉంటుంద‌ని ప‌రోక్షంగా స్ప‌ష్టం చేశారు జ‌న‌సేనాని. రాక్ష‌స పాల‌న అందిస్తున్న జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారును కూల‌దోసేందుకు.. న‌మ్మ‌క‌మైన మిత్రుడైన చంద్ర‌బాబుతో చేతులు క‌లిపేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్ప‌క‌నే చెప్పారు. 2014 హిస్ట‌రీ రిపీట్ చేస్తామ‌ని ప‌రోక్షంగా స్ప‌ష్టం చేశారు. ఏపీలో ఉన్న‌వి నాలుగే నాలుగు పార్టీలు. కామ్రేడ్ల‌ను వ‌దిలేస్తే.. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌. వైసీపీతో తాడోపేడో తేల్చుకునేందుకు ప‌వ‌న్ సీరియ‌స్‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చేసిన పొర‌బాటును ఈసారి మ‌ళ్లీ రిపీట్ చేయ‌ద‌లుచుకోలేదు. ఇప్ప‌టికే బీజేపీతో జ‌న‌సేన‌కు స్నేహ‌బంధం ఉంది. ఇక టీడీపీతో త‌ట‌స్థ వైఖ‌ర‌ అవ‌లంభిస్తోంది. ఇప్పుడు ప్ర‌త్యేకంగా పొత్తుల గురించి ప్ర‌స్తావించ‌డం.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల్చ‌బోమ‌ని తేల్చి చెప్ప‌డంతో.. ఆ పొత్తు టీడీపీతోనేన‌ని తేలిపోతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో జ‌ట్టుక‌ట్టేందుకు జ‌న‌సేన సిద్ధ‌మ‌వుతోంద‌ని అర్థం అవుతోంది. 2014లో చంద్ర‌బాబు అనుభ‌వం న‌వ్యాంధ్ర‌ను బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని టీడీపీకి మ‌ద్ద‌తిచ్చారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ బ్ర‌హ్మాండ‌మైన విజ‌యం సాధించింది. 2019 వ‌చ్చే స‌రికి ఆయ‌న సొంతంగా రాజ‌కీయాల్లో ఎద‌గాల‌ని సైకిల్‌ను వ‌దిలేశారు. అది జ‌గ‌న్‌రెడ్డికి బాగా అనుకూలించింది. ఓట‌ర్లు.. జ‌గ‌న్‌, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీల వైపు చీలిపోయారు. ప‌రోక్షంగా అది వైసీపీకి క‌లిసొచ్చింది. 2024లో ఆ మిస్టేక్ మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా.. చూసేందుకు.. గ‌త ఎన్నిక‌ల్లో మాదిరి వ‌చ్చే సారి కూడా జ‌గ‌న్‌రెడ్డికి ప్ర‌జావ్య‌తిరేక ఓటు అనుకూలించ‌కుండా.. ఉండేలా జ‌న‌సేనాని ప‌క్కా రాజ‌కీయ నాయ‌కుడిలా స‌రైన స‌మ‌యంలో, స‌రైన నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. జ‌స్ట్.. జ‌న‌సేన సై అంటే చాలు.. జ‌గ‌మొండి జ‌గ‌న్‌ను తాడేప‌ల్లి ప్యాలెస్ నుంచి త‌రిమేసేందుకు టీడీపీ ఇప్ప‌టికే క‌ద‌నోత్సాహంతో ఉంది. 2014లో ప‌వ‌న్ క‌ల్యాణ్ హ్యాండ్ ఇవ్వ‌క‌పోతే.. ఆ ఎన్నిక‌ల్లో కూడా టీడీపీనే గెలిసి ఉండేది. రెండోసారి కూడా చంద్ర‌బాబే సీఎం అయిండేవారు. జ‌గ‌న్‌రెడ్డి దుర్మార్గ‌పు పాల‌న ఉండేది కాదు. అందుకే, ఈసారి జ‌న‌సేన కాస్త మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ ఈ మూడు పార్టీల క‌ల‌యిక‌.. జ‌గ‌న్‌రెడ్డి-వైసీపీ మ‌హిషానికి కొమ్ములు ఇర‌గ్గొట్టి గ‌ద్దె దించే స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్టే ఉంది. జ‌గ‌న్‌రెడ్డి ఇక కాస్కో.. ఈ క్ష‌ణం నుంచి వైసీపీ ప్ర‌భుత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిన‌ట్టే...అంటున్నారు. అప్పుడే వైసీపీ వ‌ర్గాల్లో వ‌ణుకు మొద‌లైపోయింది. ఇప్ప‌టంలో జ‌న‌సేనాని సౌండ్ చేస్తే.. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో రీసౌండ్ వినిపిస్తోంది.
నో ఎంట్రీ పోస్టర్లు
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సభకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు అనుమతి లేదని సభా ప్రాంగణంలో పెద్దయెత్తున పోస్టర్లు వెలిశాయి. జనసేన ఆవిర్భావ సభ మంగళిగిరి ప్రాంతంలోని ఇప్పటం గ్రామంలో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేగా గెలిచి.... రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో జనసేన నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచారు. ఫలితాల అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేయకుండానే ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో రాపాక వరప్రసాద్ కు సభకు అనుమతి లేదని పోస్టర్లు వెలియడం చర్చనీయాంశమైంది.

Related Posts