YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సుజనా దారెటు...

సుజనా దారెటు...

విజయవాడ, మార్చి 15,
ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా పార్టీకి ఆయన ఉపయోగమేంటన్నది అధినాయకత్వం చూస్తుంది. ప్రజల్లో పట్టున్న నేతలకే ఏ పార్టీ నాయకత్వమైనా పదవులు ఇస్తుంది. కానీ ఈయనకు ప్రజల్లో గ్రిప్ లేదు. అందుకే ఆయన పెద్దల సభకే పరిమితమయ్యారు. బీజేపీ లో రాజ్యసభ పదవి రావడం అంత సులువు కాదు. అయినా తన ప్రయత్నాలేవో తాను ఢిల్లీలో కూర్చుని చేసుకుంటున్నారు. ఆయనే రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. సుజనా చౌదరి రాజ్యసభ పదవీ కాలం ఈ ఏడాది జూన్ నెలతో ముగియనుంది.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడటం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకోవడంతో సుజనా చౌదరికి రెండు సార్లు టీడీపీ నుంచి రాజ్యసభ పదవి దక్కింది. పన్నెండేళ్ల పాటు ఆయన రాజ్యసభ పదవిలో ఉన్నారు. 2014లో టీడీపీ గెలిచిన తర్వాత ఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీలో సుజనా చౌదరికి అలాంటి ప్రాధాన్యత దక్కేది. నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లి మాట్లాడగలిగే వెసులుబాటు సుజనాకు ఉంది. అందుకే ఆయన టీడీపీలో కంఫర్ట్ గా ఉన్నారు. జంప్ చేసినా.... 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయిన తర్వాత ఆయన బీజేపీలోకి జంప్ చేశారు. చంద్రబాబు సూచన మేరకే ఆయన బీజేపీలోకి వెళ్లారన్న వార్తలను పక్కన పెడితే ఆ పార్టీలో ఆయన సంతోషంగా లేరు. ఏపీలో ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. టీడీపీ ముద్ర బలంగా ఉండటంతో సుజనా చౌదరి మాటలకు బీజేపీ అధినాయకత్వం కూడా పెద్దగా విలువ ఇవ్వడం లేదు. టీడీపీ, బీజేపీలను కలిపేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయనే చెప్పాలి. రాజకీయంగా.... బీజేపీ మరోసారి రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశాలు లేవు. తొలి నుంచి బీజేపీని నమ్ముకున్న అనేక మంది నేతలు పెద్దల సభలో పదవి కోసం వెయిటింగ్ లో ఉన్నారు. ఆయనకు రాజకీయంగా బీజేపీలో పెద్దగా అవకాశాలు లేవనే చెప్పాలి. బ్యాంకు రుణం ఎగవేత కేసు కూడా ఆయనకు ఇబ్బందిగా మారింది. దీంతో ఆయన బీజేపీలో ఇమడలేకపోతున్నారంటున్నారు. త్వరలోనే ఆయన తిరిగి టీడీపీ గూటికి చేరే అవకాశముంది.

Related Posts