YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

మరో 5 ఏళ్లు నష్టం భర్తీ

మరో 5 ఏళ్లు నష్టం భర్తీ

ముంబై, మార్చి 16,
జీఎస్టీ ప్రవేశపెట్టన సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని 5 సంవత్సరాల పాటు భర్తీ చేస్తానని హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి రాష్ట్రాలకు పరిహారాన్ని చెల్లిస్తూ వస్తోంది. దీనిని కేంద్రం 2017 జూన్ 1 నుంచి అమలు చేసింది. 2015-16 ఆర్థిక సంవత్సర ఆదాయాన్ని బేస్ గా తీసుకుని ఏడాదికి 14 శాతం పెరుగుదలను ప్రామాణికంగా తీసుకుని నష్టాన్ని లెక్కిస్తారు. కానీ.. కేంద్రం ప్రకటించిన ఈ వెసులుబాటు ఈ ఏడాది జూన్ తో ముగిసిపోనుంది. రాష్ట్రాలకు వస్తున్న నష్టాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంపెన్సేటరీ ఫండ్ నుంచి కేంద్రం ఇప్పటి వరకు భర్తీ చేస్తూ వచ్చింది.కానీ ఇప్పుడు అనేక రాష్ట్రాలు ఈ నష్టాల భర్తీని మరింతకాలం పెంచాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ పద్ధతిని మరో 5 ఏళ్లకు పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు దిగజారినందున రాష్ట్రాలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి లేఖలు అందినట్లు నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రకటించారు.2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన జీఎస్టీ కంపెన్సేషన్లను కేంద్రం ఇప్పటికే చెల్లించింది. కంపెన్సేషన్ ఫండ్ లో సొమ్ము చెల్లింపులకు సరిపోకపోవటం వల్ల 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1.10 లక్షల కోట్లు, రూ. 1.59 లక్షల కోట్ల అప్పుగా సేకరించి చెల్లింపులు చేసింది. లగ్జరీ వస్తువులపై కేంద్రం వసూలు చేస్తున్న కంపెన్సేషన్ సెజ్ ను 2026 వరకు కొనసాగించనుందని తెలుస్తోంది. ఈ డబ్బును తీసుకున్న అప్పు చెల్లింపులకు వినియోగించనుంది.

Related Posts