YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇక రాహుల్ వల్ల కాదు ..ప్రియకనే పార్టీ కి దిక్కు కాంగ్రెస్ నేతల మనోగతం

ఇక రాహుల్ వల్ల కాదు ..ప్రియకనే  పార్టీ కి దిక్కు కాంగ్రెస్ నేతల మనోగతం

మరో రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లో నుంచి జారిపోయింది. దేశమంతా ఆసక్తిగా చూసిన  కర్ణాటకలో మరోసారి కమలం వికసించింది.  కాంగ్రెస్ ముక్త్ భారత్‌కు పిలుపునిచ్చిన బీజేపీ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. హంగ్ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తలకిందులు చేస్తూ బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఈ విజయంతో దక్షిణ భారతదేశంలో మరోసారి బీజేపీ పాగా వేసినట్లయింది. కర్ణాటకలో ఓటమితో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం మూగబోయింది. ఆ పార్టీ కార్యకర్తల ముఖాలు వాడిపోయాయి.దీంతో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ మరోసారి తెరపైకి తెస్తున్నారు. 2014లో కాంగ్రెస్ ఎన్నికల సారథిగా మొదలైన రాహుల్ గాంధీ పరాజయాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత రాహుల్ మరో కీలక రాష్ర్టాన్ని కోల్పోయారు.  కాంగ్రెస్‌లో రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీకి కీలకపాత్ర ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది.  . కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని మోదీకి దీటుగా రాహుల్ ప్రసంగాలు చేసినా.. అవి జనాన్ని ఆకట్టుకోలేకపోయాయి. కర్ణాటకలో ఓటమితో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం మూగబోయింది. ఆ పార్టీ కార్యకర్తల ముఖాలు వాడిపోయాయి.దీంతో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ మరోసారి తెరపైకి తెస్తున్నారు. కాంగ్రెస్‌లో రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీకి కీలకపాత్ర ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. రాహుల్ వెన్నంటి నడిచిన వాళ్ల నుంచే ఈ డిమాండ్ రావడం గమనార్హం. నేనెప్పుడూ రాహుల్ వెంటనే ఉన్నాను. ఇప్పుడూ ఉంటాను. కానీ ఇప్పటికైనా పార్టీలో ప్రియాంకాకు కీలకపాత్ర ఇవ్వాలి. దీనినిబట్టే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావశాకాలు ఆధారపడి ఉంటాయి అని కాంగ్రెస్ కార్యకర్తలు అభి ప్రయాన్ని  వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో కచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌కు భారీగా చేరుకున్న కార్యకర్తలు నిరాశలో కూరుకుపోయారు. వాళ్లంతా ఇప్పుడు ప్రియాంకాను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈసారి రాహుల్ కూడా కాస్త కాన్ఫిడెంట్‌గానే కనిపించారు. గెలుపుపై విశ్వాసంతో 2019లో తానే ప్రధాని అవుతా అని కూడా ప్రకటించారు. కానీ అంచనాలు మళ్లీ ఎదురుతన్నాయి. అటు ఇప్పటివరకు ప్రియాంకా మాత్రం కాంగ్రెస్‌కు బలమైన స్థానాలైన అమేథిరాయ్‌బరేలీకే పరిమితమయ్యారు తప్ప మిగితా ప్రాంతాలపై పెద్దగా దృష్టి సారించలేదు.

Related Posts