YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

ఇండియా భిన్న‌మైన విధానాన్ని అవ‌లంభిస్తుంది

ఇండియా  భిన్న‌మైన విధానాన్ని అవ‌లంభిస్తుంది

వాషింగ్ట‌న్‌ మార్చ్ 22
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన ర‌ష్యాపై అమెరికా మిత్ర దేశాల వైఖ‌రి అంతా ఒక్క‌టిగానే ఉంద‌ని, కానీ ఒక్క ఇండియా మాత్ర‌మే భిన్న‌మైన విధానాన్ని అవ‌లంభిస్తున్న‌ట్లు జో బైడెన్ అన్నారు. వాషింగ్ట‌న్‌లో వ్యాపార‌వేత్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ బైడెన్ ఈ వాఖ్య‌లు చేశారు. అమెరికా నేతృత్వంలోని కూట‌మి దేశాల‌ను బైడెన్ కీర్తించారు. నాటో, యురోపియ‌న్ యూనియ‌న్‌, ఆసియా దేశాలు అన్నీ పుతిన్‌కు వ్య‌తిరేకంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కానీ ఒక్క భార‌త్ వైఖ‌రి మాత్ర‌మే మిన‌హాయింపుగా ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. క్వాడ్ గ్రూప్‌లోని ఆస్ట్రేలియా, జ‌పాన్‌, అమెరికా దేశాలు ర‌ష్యా తీరును ఖండిస్తున్నాయ‌ని, కానీ ర‌ష్యా నుంచి డిస్కౌంట్‌లో ఆయిల్ కొనేందుకు సిద్ద‌మైన‌ ఇండియా విధానం భిన్నంగా ఉన్న‌ట్లు బైడెన్ ఆరోపించారు. యూఎన్‌లోనూ ర‌ష్యాకు వ్య‌తిరేకంగా ఇండియా ఓటు వేయ‌లేదు. నాటోతో పాటు ప‌సిఫిక్ దేశాల‌న్నీ ఐక్యంగా ఉన్న‌ట్లు చెప్పారు. క్వాడ్ గ్రూపులో ఇండియా ఒక్క‌టే మిన‌హాయింపు అని, జ‌పాన్ చాలా తీవ్రంగా ర‌ష్యాను వ్య‌తిరేకిస్తోంద‌ని, అలాగే ఆస్ట్రేలియా కూడా ఉంద‌న్నారు.

Related Posts