YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ అరెస్ట్ కు రంగం సిద్ధం

కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ అరెస్ట్ కు రంగం సిద్ధం

కర్నూలు
కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ  కంబగిరి రాముడు అరెస్ట్ కు రంగం సిద్ధం అయింది.  సెబ్ అధికారుల తనిఖీలలో తమిళనాడు కు చెందిన సతీశ్ బాలకృష్ణన్ అనే వ్యక్తి నుంచి 75లక్షలు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును తాలూకా స్టేషన్ కు  అప్పగించారు. దాంతో సీఐ కంబగిరి రాముడు చేతివాటం ప్రదర్శించాడు. జిల్లా ఎస్పీ కి ఇవ్వాలని 15లక్షలు తీసుకున్నాడు. బాధితుడు సతీష్ బాలకృష్ణన్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసాడు. దాంతో పోలీసు ఉన్నతాధికారులు సీఐ, ఎస్ఐ తో పాటు ముగ్గురి పై కేసు నమోదు చేసారు. సదరు సిఐ పరారీలో ఉన్నాడు.  అతని అరెస్ట్ కోసం జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసారు.

Related Posts