YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో రైల్వే జోన్ అడుగులు

ఏపీలో రైల్వే జోన్ అడుగులు

విశాఖపట్టణం, మార్చి 26,
ఏపీకి కేంద్రం మరో శుభవార్త చెప్పింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌, వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటుకోసం 2020-21 బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయించామన్నారుదక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు డీపీఆర్‌ సమర్పించాక కొత్త రైల్వేజోన్‌, రాయగడ రైల్వే డివిజన్‌ ఏర్పాటుకు పరిధి, ఇతర అంశాల గురించి చాలా విషయాలు తమ దృష్టికి వచ్చాయని.. ఈ అంశాలను లోతుగా పరిశీలించడానికి సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ లెవెల్‌ కమిటీని ఏర్పాటుచేశామన్నారు. కొత్త జోన్‌ ఏర్పాటుకు ముందస్తు ఏర్పాట్లు, ప్రణాళికలు చేపట్టాలని విశాఖపట్నంలోని దక్షిణ కోస్తా రైల్వే ఓఎస్డీకి నిర్దేశించినట్లు తెలిపారు. రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి భూమిని ఎంపిక చేశామని చెప్పారు.కర్నూలు కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ కేటాయింపులు రూ.560 కోట్లకు పెంపు: 2013-14లో రూ.110 కోట్లతో మంజూరుచేసిన కర్నూలు కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ కేటాయింపులను తాజాగా రూ.560.72 కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ.178.35 కోట్లు కేటాయించి రూ.171.2 కోట్లు ఖర్చుచేసినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణలో ఆలస్యం చేయడం వల్లే ప్రాజెక్టు ఆలస్యం అవుతోందన్నారు. ఆ భూమిని గత ఏడాది నవంబరులో రైల్వేకి అందించినట్లు తెలిపారు.
మరోవైపు కడప-బెంగుళూరు రైల్వేలైన్‌ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం తన వాటా డిపాజిట్‌ చేయకపోవడంతో ఆ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిపేసినట్లు మంత్రి చెప్పారు. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లిస్తేనే పనులు మొదలవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా సమకూర్చనందున ప్రాజెక్టు పనులు నిలిపేశామని.. 2022-23 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.వెయ్యి మాత్రమే కేటాయించామన్నారు. ప్రభుత్వం రూ.289 కోట్లు డిపాజిట్‌ చేయాలన్నారు

Related Posts