YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

రెచ్చిపోతున్న ఆన్ లైన్ కేటుగాళ్లు

రెచ్చిపోతున్న ఆన్ లైన్ కేటుగాళ్లు

హైదరాబాద్, మార్చి 28,
తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అవకాశం వచ్చిందంటే చాలు తమ మాయాజాలం ప్రజలపై ప్రదర్శిస్తూ అకౌంట్లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు ఏటీఎం సెంటర్లలో జనం రద్దీగా ఉండే సెంటర్లలో మాత్రమే జరిగే అకౌంట్ చోరీలు ఇప్పుడు నెట్ ఫోన్ల పుణ్యమా అని నేరుగా మన వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి అకౌంట్లో సొమ్ము ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు….. గుంటూరు జిల్లాలో తాజాగా జరుగుతున్న అనేక ఘటనలు నష్టాల పాలు చేస్తున్నాయి.మీ ఆయనకు ఆరోగ్యం బాగా లేదు కదా మీకు సీఎం ఆఫీస్ నుండి లక్ష రూపాయలు శాంక్షన్ అయ్యాయి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అందులో మినిమం ఓ పది వేలు ఉంచండి ఆతరువాత లక్ష రూపాయలు మీవే అంటూ మాయగాళ్ళు విసిరిన వలకు అకౌంట్లో సొమ్ము ఖాళీ చేసుకుంది ఓ మహిళమనిషి వ్యక్తిగత సమాచారం, అవసరాలు తెలుసుకుని, మీకు ఆరోగ్యశ్రీ అమౌంట్ వచ్చింది, ఈ రోజు తో ఆఖరు ..మీ అకౌంట్ నంబర్ చెప్తే అమౌంట్ వేస్తాం లేదంటే మీ ఇష్టం అంటూ ఒక మహిళ ను నమ్మిచడం ఆతరువాత ఆమె ద్వారా మరో మహిళ అకౌంట్ లో ఆమె అన్న అకౌంట్ లో డబ్బును క్షణాల్లో కొట్టేసిన వ్యవహారం కొత్త మళ్ళాయి పాలెం లో జరిగింది. ఇవే కాదు మీరు మా దగ్గర అప్పు తీసుకున్నారు ఆ అప్పు చెల్లించకపోతే మీపై తప్పుడు ప్రచారం చేస్తాం అసభ్య ఫోటోలు పెట్టి మీ పరువు తీసేస్తా అంటూ మెసేజ్.మీరు ఇంట్లోనే ఉండి రోజుకి వేలకు వేలు సంపాదించవచ్చు వర్క్ ఫం హోం ద్వారా రోజుకు ఐదు వేల ఆదాయం అంటూ మెసేజ్ లు. మీరు మొబైల్ ఫోన్ లో యూట్యూబ్ లింకులు ఓపెన్ చేస్తే నెలకు 40వేల జీతం అంటూ నమ్మబలికి తీయటి మాటలు చెప్పి అమాయకుల వద్ద లక్షల్లో కాజేస్తున్నారు కేటుగాళ్లు. మరోవైపు బ్యాంకు ఓటీపీల పేరుతో జరుగుతున్న ఆన్లైన్ నిలువు దోపిడీ తో ప్రజలు ఫోన్ పట్టుకోవాలంటేనే వణికిపోయే పరిస్థితి. ఇతర రాష్ట్రాల నుండి చక్కటి తెలుగు భాషలో మాట్లాడి అమాయకులను బుట్టలో పడేస్తున్నారు సైబర్ దొంగలు. షాపింగ్ మాల్స్ ఇతర బహిరంగ ప్రదేశాల్లో మీ వ్యక్తిగత సమాచారం ఇతరులతో షేర్ చేయొద్దు అంటున్నారు పోలీసులు. అనుమానితులు అపరిచిత వ్యక్తులు ఫోన్ నెంబరు ఇవ్వవద్దంటున్నారు.

Related Posts