YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మహేష్ బ్యాంక్ కేసులో నిందితుడి గుర్తింపు

మహేష్ బ్యాంక్ కేసులో నిందితుడి గుర్తింపు

హైదరాబాద్
మహేష్ బ్యాంకు నిధుల గోల్మాల్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కేసు దర్యాప్తు వివరాలు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సివి అనంద్ బుధవారం మీడియాతో కు వెల్లడించారు. నైజిరీయా లేక లండన్ నుంచి నిందితులు బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసి నిధులను కొట్టేశారు. బ్యాంకు ఖాతాలతో పాటు సర్వర్లో చొరబడి 14 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. నిధులు కాజేసిన ప్రధాన సూత్రధారిని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 23మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నైజీరియన్ కు సపోర్ట్ చేసిన కీలక సూత్రధారిని అరెస్ట్ చేసినట్లు అయన తెలిపారు.
బ్యాంక్ కుడా నిర్లక్ష్య ధోరణిలో నెట్ వర్క్ నడిపించారని సిపి అన్నారు. నెట్ వర్క్ సురక్షితంగా వుండేందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులు గుర్తించారు.  ప్రజల సొమ్ముతో బిజినెస్ చేస్తున్న బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆర్బీఐ చెప్పినా కొన్ని బ్యాంకులు పాటించడం లేదన్నారు.ఇప్పటి వరకు ఇదే తరహాలో మూడు బ్యాంకుల నిధులను నేరాగాళ్లు కొట్టేశారు. అందులో.. మహారాష్ట్రలో బ్యాంక్ ఆఫ్ బరోడా, తెలంగాణ కోపరేటివ్ బ్యాంకు, మహేష్ నిధులను లూటీ చేశారు.

Related Posts