YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఏళ్లు గడుస్తున్నా నియామకాలు?

ఏళ్లు గడుస్తున్నా నియామకాలు?

హైదరాబాద్, ఏప్రిల్  5,
ఉత్తమ విద్యకు, సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకు నిలయంగా.. విద్యార్థుల వికాసానికి తోడ్పడే కేంద్రంగా ఉండాల్సిన అత్యున్నత విద్యా సంస్థలే.. యూనివర్సిటీలు. కానీ రాష్ట్రంలో యూనివర్సిటీలకే ‘వికాసం’ లేని దుస్థితి. రెగ్యులర్‌ అధ్యాపకులు లేక నామ మాత్రపు బోధన ఒకవైపు.. ఏమాత్రం మౌలిక సదుపాయాలు లేక అవస్థలు మరోవైపు.. విద్యార్థుల భవిష్యత్తుకు గండి కొడుతున్నాయి. కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలేమోగానీ కనీస ‘చదువు’కే దిక్కు లేకుండా పోతోందని.. ప్రభుత్వం నుంచి తగిన సాయం అందకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, వ్యవస్థాపరమైన లోపాలు వంటివి వర్సిటీలకు శాపంగా మారాయని ఆందోళన వ్యక్తమవుతోంది.రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో మంజూరైన పోస్టు లు 2,828 ఉండగా.. అందులో 1,869 పోస్టులు అంటే మూడింట రెండొంతులు ఖాళీగానే ఉండటం గమనార్హం. నిజానికి 2017 నవంబర్‌ నాటికి యూనివర్సిటీల్లో 1,528 ఖాళీలు ఉన్నట్టు గుర్తిం చారు. అప్పట్లోనే 1,061 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇదుగో.. అదుగో అంటూ ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి ఇప్పటికీ ఏమీ తేల్చలేదు. ఓ సారి రిజర్వే షన్లు అంశం అంటూ, మరోసారి న్యాయపరమైన వివాదా లు అంటూ, మరోసారి నియామకాల తీరుపై కసరత్తు చేస్తున్నామంటూ దాట వేస్తూ వచ్చాయి. దీనితో గత ఏడాది జనవరి 31 నాటికి ఖాళీల సంఖ్య 1,869కి పెరిగింది. కేటగిరీల వారీగా చూస్తే 238 ప్రొఫెసర్‌ పోస్టులు, 781 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 850 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబం ధించి కాంట్రాక్టు, తాత్కాలిక అధ్యాపకులతో బోధన నిర్వహిస్తూ మమ అనిపిస్తున్న పరిస్థితి నెల కొంది. దీనివల్ల పూర్తిస్థాయిలో బోధన అందడం లేదని, రెగ్యులర్‌ అధ్యాపకుల నియామకాలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.105 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఫ్యాకల్టీ కొరత, మౌలిక సదుపాయాల లేమి తో సతమతం అవుతోంది. దాదాపు అన్ని విభాగా ల్లోనూ కాంట్రాక్టు, పార్ట్‌టైం అధ్యాపకులతో బోధన కొనసాగుతోంది. సీనియర్‌ ఫ్యాకల్టీ లేక పరి శోధనలనే మాటే లేకుండా పోయిందని.. పీజీ స్థాయిలో బోధన మొక్కుబడిగా సాగుతోందని విద్యార్థులు వాపోతున్నారు. ల్యాబ్‌లలో రసాయ నాలు, పరి కరాలు సరిగా లేవని.. ఇతర మౌలిక వసతులూ లేక ఇబ్బంది పడుతున్నామని అంటు న్నారు. జేఎన్టీయూ లోనూ ఇదే దుస్థితి నెలకొంది. ఇక ఉన్నత విద్యా మండలి ప్రతిష్టాత్మ కంగా నిజాం కాలేజీలో, కోఠి ఉమెన్స్‌ కాలేజీలో ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్‌ కోర్సుకు ఫ్యాకల్టీ సమస్య వేధిస్తోంది.దేశంలోనే మొట్టమొదటి భాషా విశ్వవిద్యాలయ మైన పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పరిస్థితి మరీ చిత్రం. ఇందులో మొత్తంగా ముగ్గురే రెగ్యులర్‌ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ఇందులోనూ ఒకరు రిజిస్ట్రార్‌గా, మరొకరు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌ గా పనిచేస్తుండటం గమనార్హం. జ్యోతిషం, తెలు గు, ఇంగ్లిష్, కంప్యూటర్, భాషా అను బంధ శాఖ, విజ్ఞాన సరస్వత శాఖ. తులనాత్మక అధ్యయన శాఖ, జర్నలిజం, భాషాభివృద్ధి శాఖ, లింగ్విస్టిక్, భాషా నిఘంటు నిర్మాణ శాఖ జానపదం, సంగీ తం శాఖల్లో పోస్టులన్నీ ఖాళీయే. అన్నింటా తాత్కా లిక అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు.

Related Posts