YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

అర్థరాత్రి పూట కార్లను ధ్వంసం చేస్తున్న రిటైర్డ్ అధికారి

అర్థరాత్రి పూట కార్లను ధ్వంసం చేస్తున్న రిటైర్డ్ అధికారి

హైదరాబాద్ ఏప్రిల్ 7,
హైదరాబాద్ నగరంలోని మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొద్ది కాలంగా పార్క్‌ చేసిన కార్లు, వాహనాలు ధ్వంసమవుతున్నాయి. అర్ధరాత్రులు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తీరా ఓ రోజు సీసీ కెమెరాలుచూస్తే అసలు విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు మాదన్నపేట్ రెడ్డి సంఘం అధ్యక్షుడు, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ బొక్క భూపాల్ రెడ్డి. అర్ధరాత్రి పూట అందరూ నిద్ర పోయిన తరువాత వాకింగ్ కోసం బయటకు వచ్చే భూపాల్ రెడ్డి, పార్క్‌ చేసి ఉంచిన కార్లను తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో పూర్తిగా పాడు చేసి తిరిగి ఇంటికెళ్లి పడుకుంటాడు. ఇలా రోజు చేయడం అతని హాబీ. ఇకనైనా పోలీసులు కల్పించుకుని అతని వ్యసనం నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Related Posts