YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

గంజాయి గ్యాంగ్ ఆరెస్టు

గంజాయి గ్యాంగ్ ఆరెస్టు

హైదరాబాద్
వైజాగ్ నుండి ఢిల్లీ కి గంజాయి, హాష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశాం. వీరి నుంచి 52 కిలోల గంజాయి, లీటర్ హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. యూపీ కి చెందిన గ్యాంగ్ ఇది. ఢిల్లీ కి చెందిన ఇమ్రాన్ ఈ గ్యాంగ్ ని వైజాగ్ ఏజెన్సీ ఏరియా కి పంపి గంజాయి తెప్పిస్తున్నాడు. మార్కెట్లో హాష్ ఆయిల్ లీటర్ కి 3 లక్షలు రేట్ ఉంది. కేజీ 10 వేలు ఉండే గంజాయి రేటు... 15 వేలకు పెరిగింది. వైజాగ్ లోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో గంజాయితో ట్రైన్ ఎక్కారు. మౌలాలి రైల్వేస్టేషన్ లో దిగారు... అక్కడ వారిని అదుపులోకి తీసుకున్నామని అయన అన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చెకింగ్ ఎక్కువగా ఉంటుందని మౌలాలి లో దిగారు. ఎలాంటి అనుమానం లేకుండా ట్రావెల్ బ్యాగ్ లో గంజాయి తరలిస్తున్నారు. వైజాగ్ నుంచి గరీబ్ రథ్ ట్రైన్ లో ఏసీ టికెట్స్ బుక్ చేసుకొని ట్రావెల్ చేస్తున్నారు. ఇమ్రాన్ ని పట్టుకోవడానికి టీమ్స్ ని ఢిల్లీ కి పంపిస్తున్నామని వెల్లడించారు.

Related Posts