YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తెలంగాణలో రూ.1000 కోట్ల కోకాకోలా ప్లాంట్

తెలంగాణలో రూ.1000 కోట్ల కోకాకోలా ప్లాంట్

హైదరాబాద్ ఏప్రిల్ 7
తెలంగాణలో భారీ పెట్టుబడికి కోకాకోలా ముందుకొచ్చింది. రూ.1000 కోట్ల ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. రూ.1000 కోట్ల పెట్టుబడితో రెండో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టు హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ (హెచ్సీసీబీ) గురువారం ప్రకటించింది. సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్లోని ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్లో కార్బోనేటేడ్ పానీయాలు జ్యూస్లు నీటి ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు.ఈ ప్లాంట్లో మొదటి దశలో రూ.600 కోట్లు తదుపరి దశల్లో మరో రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నామని వచ్చే ఐదేళ్లలో మొత్తం పెట్టుబడిని రూ.1000 కోట్లకు ర్చనున్నామని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.ఆర్ కు కంపెనీ తెలిపింది.
ఈ మేరకు కేటీఆర్ తో కోకాకోలా ప్రతినిధులు భేటి అయ్యి ప్రణాళికలు వివరించారు.హెచ్సిసిబి సీఈఓ నీరజ్ గార్గ్.. బాట్లింగ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జువాన్ పాబ్లో రోడ్రిగ్స్ ట్రోవాటోలు తాజాగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు - వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ను కలిసి ఈ ఒప్పందం చేసుకున్నారు.తెలంగాణలో హెచ్సీసీబీకి ఇది రెండో బాట్లింగ్ ప్లాంట్. ఇది రాబోయే 10 సంవత్సరాలలో ఈ ప్రాంతంలోని అమ్మకాల డిమాండ్ ను తీర్చడానికి కంపెనీ తయారీ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుందని తెలిపారు. రాబోయే ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 49 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రాష్ట్ర స్వీయ ధ్రువీకరణ పారిశ్రామిక విధానంలో అనుమతుల కోసం ఎదురుచూడకుండా నిర్మాణంలో ముందుకు వెళ్లవచ్చని మంత్రి కంపెనీకి హామీ ఇచ్చారు.ప్లాంట్ ద్వారా చాలా మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తామని మంత్రి కేటీఆర్కు కంపెనీ హామీనిచ్చింది. ఉద్యోగుల్లో 50 శాతానికి పైగా మహిళలే ఉంటారని కంపెనీ ప్రకటించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2023 చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.హెసీసీబీ తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఎమ్ఒయు ప్రకారం.. రాష్ట్రంలోని ఇతర పరిశ్రమలకు నీటి వనరుల నిర్వహణ ఘన వ్యర్థాల మెరుగైన నిర్వహణ.. యువతలో నైపుణ్యాలను పెంపొందించడంలో హెచ్.సీసీబీ సహాయం చేస్తుంది. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) భాగస్వామ్యంతో కంపెనీ 10000 మంది యువతకు శిక్షణనిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Related Posts