YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చిన్న పత్రికల పెద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్

చిన్న పత్రికల పెద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 15
రాష్ట్రంలోని చిన్న పత్రికల మనుగడకు పెద్దమనసుతో స్పందించి ప్రకటనలు ఇస్తుండడమే కాకుండా  బిల్లులు కూడా విడుదల చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు చిన్న పత్రికల పాలిట పెద్దన్నగా నిరూపించుకున్నారని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని అన్నారు. . అసోసియేషన్ మేనేజింగ్ కమిటీ సమావేశం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని అధ్యక్షతన   ఈరోజు బుద్దభవన్ లోని యూనియన్  రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా రాష్ట్రంలోని చిన్న పత్రికలు, మద్య తరహా పత్రికల యాజమాన్యాలు ఎన్నో కష్ట నష్టాల కోర్చిసైతం పత్రికలు నడిపారని ఈ విషయంలో కేసీఆర్ ఒక సానుకూల నిర్ణయం తీసుకుని గత కొన్ని మాసాలుగా క్రమం తప్పకుండా ప్రతినెల ప్రకటనలు విడుదల చేస్తూ లక్షలాది మంది ఆధార పడి ఉన్న స్థానిక పత్రికా రంగాన్ని ఆదుకున్నారని అందుకు టిజేఏ మేనేజింగ్ కమిటీ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపిందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలపాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టులకు ఇళ్ళ విషయంలో కొన్ని జిల్లాలలో ఇప్పటికే ముందడుగు పడిందని మిగతా  ప్రాంతాలలో కూడా  త్వరితగతిన పూర్తవుతాయన్న నమ్మకాన్ని కమిటీ వ్యక్తం చేసినట్లు నారగౌని తెలిపారు. స్థానిక పత్రికలన్నింటిని ఎంపానెల్మెంట్ లిస్ట్ లో చేర్చి వాటికి కూడా ప్రకటనలు విడుదల చేసి మిగతా పత్రికలను కూడా ఆదుకోవాలని అలాగే  స్థానిక పత్రికారంగంపై మరింత సానుకూలతను ప్రదర్శించి ఈ రంగానికి మరింత అండగా నిలవాలని సమవేశం ప్రభుత్వాన్ని కోరింది.

Related Posts