YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పల్నాడు లో దారుణం మహిళపై లైంగిక దాడి

పల్నాడు లో దారుణం మహిళపై లైంగిక దాడి

పల్నాడు
పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. లైంగిక దాడితో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గురజాల రైల్వేస్టేషన్ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని మహిళ రైల్వేస్టేషన్ సమీపంలో అపస్మారక స్థితిలో ఉండడాన్ని ప్రయాణీకులు గమనించారు. మహిళ పక్కనే రెండేళ్ల కొడుకు ఉన్నాడు. సమీపంలో రక్తపుమరకలు ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు మహిళను గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులు తనపై లైంగికదాడికి పాల్పడినట్లు మహిళ చెప్పిందంటున్నారు వైద్యులు. మహిళ మాట్లాడుతున్న బాష కూడా అర్దంకావడం లేదన్నారు. బ్లీడింగ్ ఎక్కువకావడంతో చికిత్స అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఉపాధికోసం వచ్చిన మహిళ ఒంటరిగా ఉండడం గమనించి దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Related Posts