YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కోర్టులో పత్రాల చోరీపై హైకోర్టు సుమోటోగా స్వీకరించి సమగ్ర విచారణ జరిపించాలి

కోర్టులో పత్రాల చోరీపై హైకోర్టు సుమోటోగా స్వీకరించి సమగ్ర విచారణ జరిపించాలి

అమరావతి ఏప్రిల్ 16
నెల్లూరు కోర్టులో కేసు పత్రాల చోరీపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. మంత్రి కాకాణి నిందితుడిగా ఉన్న కేసులో ఆధారాలు ఎత్తుకుపోవడం దుర్మార్గమని ఆయన ఆరోపించారు.. కోర్టు లాకర్‌లో సాక్ష్యాల చోరీని ఏమనాలని అన్నారు. కాకాణికి శిక్ష పడుతుందనే సాక్ష్యాల చోరీ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి బెయిల్ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కాగా ఈ సంఘటనపై నెల్లూరు కోర్టు భవనాల సముదాయం వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. దొంగల బారి నుంచి న్యాయస్థానాన్ని రక్షించాలని, దోషులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు. కాకాణి మొదటి ముద్దాయిగా ఉన్న కేసు ప్రాపర్టీ చోరీకి గురైందని , వందల కేసులు ఉండగా ఈ ఒక్క కేసు పత్రాలే ఎందుకు దొంగిలించారని ప్రశ్నించారు. చోరీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.చోరీకి పాల్పడిన అసలు దొంగలను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. భారత దేశ చరిత్రలోనే ఇలాంటి చోరీ జరగలేదని వారు ఆరోపించారు. కేసు పత్రాలు దొంగిలించడం దుర్మార్గమైన చర్యని, కోర్టులోనే చోరీ జరిగితే ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలని ఆందోళన వ్యక్తం చేశారు.

Related Posts