YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మిత్రులు..శత్రువులు అవుతున్నారా

మిత్రులు..శత్రువులు అవుతున్నారా

నెల్లూరు, ఏప్రిల్ 18,
మిత్రువుకు శత్రువు మిత్రుడు’ పూర్వకాలం నుంచీ వినిపిస్తున్న కొటేషన్ ఇది. ఇప్పుడు కూడా అదే కొటేషన్ ను ఇద్దరు నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు నిజం చేస్తున్నారా? అంటే అవును అనే అనుమానాలు వస్తున్నాయి. తాజాగా మంత్రి పదవి కోల్పోయి మనసంతా ఆక్రోశం నింపుకున్న అనిల్ కుమార్ యాదవ్ ఒకరైతే.. తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బెర్త్ ఆశించి భంగపడ్డ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరొకరు. వీరిద్దరూ తాజాగా కలుసుకోవడం ఇప్పడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో అనిల్ కుమార్ యాదవ్- ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఉప్పు- నిప్పు మాదిరిగా ఉండేవారంటారు. అలాంటి వీరిద్దరు కేబినెట్ రీషఫిల్ అనంతరం కలుసుకోవడం దేనికి సంకేతం? అనే ప్రశ్న ఉదయిస్తోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ అవడం పట్ల రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కూడా అనిల్ కుమార్ భేటీ కావడమూ వైసీపీ వర్గాల్లో అలజడి రేపింది.మంత్రివర్గంలో కొనసాగింపు కావాలని అనిల్ కుమార్ ఆశించారు. కొత్త కేబినెట్ లో తనకు స్థానం దక్కాలని శ్రీధర్ రెడ్డి ఆశించి భంగపడ్డారు. భంగపడిన బాధలో శ్రీధర్ రెడ్డి ఏకంగా మీడియా సమావేశంలోనే కన్నీరు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి చేసింది. తమకు కేబినెట్ బెర్త్ దొరకలేదనే మనస్తాపం కన్నా తామిద్దరికీ ఉమ్మడి శత్రువు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కడమే మరింతగా వారిని ఎక్కువగా బాధపెడుతోందని చెబుతున్నారు. ఈ క్రమలోనే అనిల్ కుమార్, కోటంరెడ్డి భేటీ అవడం వైసీపీ నేతలు, శ్రేణుల్లో ఆసక్తిగా మారింది. అంతకు ముందే ఎడముఖం పెడముఖంగా ఉంటున్న తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అనిల్ కుమార్, కోటంరెడ్డి శ్రీధర్ ఉమ్మడిగా కత్తికడతారా? అనే సందేహాలు కూడా వైసీపీ వర్గాల్లో కలుగుతున్నాయంటున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలకు కూడా అంతగా సఖ్యత లేదనే చెబుతారు. సీఎం జగన్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం మాటేమో గానీ నెల్లూరు జిల్లా వైసీపీ నేతల మధ్య ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారి బయటకు వచ్చాయని అంటున్నారు.పైగా తన సభను వాయిదా వేసుకోవాలని వైసీపీ అధిష్టానం తనకు చెప్పలేదని, ఎవరో కార్యక్రమం పెట్టుకున్నారని, తాను నిర్వహించడం లేదని చెప్పడం గమనార్హం. అనిల్ చెప్పిన ‘ఆ ఎవరో’ అంటే మంత్రి కాకాణి గోవర్ధన్ అనేది చెప్పక చెప్పారంటున్నారు. ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే.. కేబినెట్ పునర్వ్యస్థీకరణ తర్వాత ‘గడప గడపకూ వైసీపీ కార్యక్రమం’లో ఫుల్ బిజీ అయిపోయారు. మంత్రి కాకాణి సన్మాన సభకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యే ప్రసక్తే లేదని కొందరు చెబుతున్నారు.

Related Posts