YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

గుప్పుమంటున్న గుడుంబా

గుప్పుమంటున్న గుడుంబా

నల్గో్ండ,  ఏప్రిల్ 18,
గుడుంబా రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వాటిని అరికట్టడం లో ఎక్కడో ఓ దగ్గర విఫలమవుతూనే ఉన్నాయి. నాటు సారా తాగి ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాని నిషేధం పై గట్టి చర్యలు చేపట్టింది. కానీ దాన్ని వ్యాపారం గా చేసుకుని బతుకుతున్నా కొందరు రహస్యంగా సారా తయారు చేస్తూ పట్టణ కేంద్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం.యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం తో పాటు వివిధ గ్రామాల్లో యథేచ్ఛగా బెల్టుషాపులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వైన్ షాప్ యజమానులు అధిక ధరలకు బెల్ట్ షాప్ నిర్వాహకులకు మధ్య అమ్ముతున్నట్లు సమాచారం. వైన్ షాపు యజమానుల ప్రోత్సాహంతోనే బెల్ట్ షాప్ నిర్వాహకులు విచ్చలవిడిగా కిరాణా షాపుల ముసుగులో కూల్ డ్రింక్స్ లా మద్యాన్ని అమ్ముతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ తతంగమంతా తెలిసిన ఎక్సైజ్ అధికారులు వైన్ షాప్ యజమానుల మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి స్థానికంగా పని చేస్తున్న కూలీలు ఎక్కువ డబ్బులు చెల్లించి మధ్యాన్ని కొనలేక స్థానికంగా సారా కొనుగోలు చేసి బహిరంగంగా తీసుకెళ్తుండటం చర్చనీయాంశమైంది. మద్యానికి అలవాటు పడ్డ కూలీలు తక్కువ ధరకు సారా లభిస్తుండడం తో వాటిని సేవించి అనారోగ్యం పాలవుతున్నట్లు సమాచారం.నారాయణపురం మండల కేంద్రంలోనే విచ్చలవిడిగా సారా లభించడంతో అసలు ఇది ఎక్కడ తయారు చేస్తున్నారనే అనుమానం స్థానికులలో మొదలైంది. మండల పరిధిలో పదుల సంఖ్యలో గిరిజన తండాలు ఉండడంతో సారా తయారీ అక్కడే జరుగుతుందా లేక రూటు మార్చి గుడుంబా వ్యాపారులు స్థానికంగానే మరెక్కడైనా తయారు చేస్తున్నారా అనుమానం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. సారా తయారీ అంటే ఎక్సైజ్ అధికారులు గిరిజన తండాలపై మాత్రమే దాడులు నిర్వహిస్తారనే ఆలోచనతో అక్రమార్కులు మరెక్కడైనా స్థావరం ఏర్పాటు చేశారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వాలు కఠిన లాక్ డౌన్ అమలు చేయడంతో మద్యం ప్రియులు నానా అవస్థలు పడ్డారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి మద్యానికి బానిసైన వారు బెల్టుషాపుల లో కొనుగోలు చేయడం కోకొల్లలు చూశాం. అయితే ఇదే సమయంలో మద్యానికి అలవాటు పడ్డ కూలీలు అంత ఖర్చు పెట్టి మద్యం తాగలేక ప్రత్యామ్నాయం వైపు ఆలోచన చేసినట్లు సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకున్న పలువురు గుడుంబా వ్యాపారులు తిరిగి నాటుసారాను తయారు చేసినట్లు స్థానిక ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అప్పటినుండి నాటు సారా కు అలవాటు పడ్డ కూలీల బలహీనతను ఇంకా కూడా గుడుంబా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తుందివీటన్నిటినీ నియంత్రించడంలో ఎక్సైజ్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బెల్టు షాపు నిర్వాహకులతో బెంబేలెత్తిపోతున్న స్థానిక మహిళలు నాటుసారా కూడా దొరుకుతుండడంతో తమ కుటుంబం లోకి ప్రవేశించి ఎప్పుడు చిచ్చుపెడుతుందోని భయాందోళనకు గురవుతున్నారు. ఇకనైనా ఎక్సైజ్ అధికారులు గట్టి నిఘా పెంచి అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుకుంటున్నారు.

Related Posts