YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో భగ్గుమంటున్న విబేధాలు

వైసీపీలో భగ్గుమంటున్న విబేధాలు

విజయవాడ, ఏప్రిల్ 19,
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గాన్ని విస్తరించి వారం రోజుల పైనే అయింది. కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. పవర్’ ను  పవర్’తో పాటు వచ్చిన కొత్త వైభోగాలను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, మరోవంక మంత్రులు, మాజీల మధ్య యుద్ధం నడుస్తోంది. మంత్రివర్గ విస్త’రణం’తో  పాతకొత్త మంత్రుల మధ్య, మొత్తంగా అధికార వైసీపీలో రగిలిన, రాజకీయ మంటలు మంత్రం నివురు గప్పిన నిప్పులా భగ్గుమంటూనే ఉన్నాయి. నిజానికి, రోజు రోజుకు హీట్ పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అధికార పార్టీలో, పాతకొత్త మంత్రుల మధ్య పార్టీ రెండుగా చెల్లిపోయింది. ఏ వర్గానికి ఆ వర్గం తగ్గేదేలే’ అన్నట్లుగా వ్యహరిస్తోది. ఒక్క మాటలో చెప్పాలంటే, అధికార పార్టీలో అగ్గి రాజుకుంది. భగ్గుమనేందుకు సిద్దంగా ఉంది.నిజానికి, పార్టీలోనే కాదు, అన్నదమ్ముల మధ్య  మంత్రి పదవుల కుండమార్పిడి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన సోదరులు గతంలో అపూర్వ సోదరులుగా ఉన్నరని అనలేము కానీ, ఇప్పుడు ఆగర్భ శత్రువులుగా మారారు అనేది మాత్రం నిజం అంటున్నారు.  ఇద్దరి మధ్య మంత్రివర్గ విస్తరణ చిచ్చు పెట్టింది. చివరకు అన్నదమ్ముల మధ్య మాటలు కూడా ‘కట్’ అయ్యాయనే టాక్ వైసీపీలో వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణకు ముందు, అన్న ధర్మాన కృష్ణ దాస్, రెవిన్యూ శాఖ మంత్రి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగ్గర మంచి మార్కులే తెచ్చుకున్నారు. అయినా ,విస్తరణ తర్వాత మంత్రి పదవితో పాటుగా, రెవిన్యూ శాఖ కూడా బ్రదర్  ధర్మాన ప్రసాద రావుకు దక్కింది. అయితే రెవిన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే రెవిన్యూ శాఖలో అవినీతి పేరుకు పోయిందని,ధర్మాన చేసిన వ్యాఖ్య ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.ఆయన, ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్య చేశారో ఏమో కానీ మాజీ మంత్రి అన్న కృష్ణ దాస్’ పైనే ధర్మాన అవినీతి  ముద్ర వేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కృష్ణ దాస్ సైలెంట్’గానే ఉన్నా, ఇటు అధికార పార్టీలోఅటు అధికార వర్గాల్లో మాత్రం, మంత్రి ధర్మాన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా రెవిన్యూ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు కొత్త మంత్రి వస్తూవస్తూనే తమ శాఖ ఉద్యోగులపై అవినీతి ముద్ర వేయడం ఏమిటని,ప్రశ్నిస్తున్నారు. రెవిన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం  అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కొంత సౌమ్యంగానే అయినా, ‘అన్నీ’ తెలిసిన ధర్మాన తమను అవినీతి పరులు అనడం ఏమిటన్నారు. ఈ రాష్ట్రంలో  నిజాయితీగా పని చేసే శాఖ ఏదైనా ఉందంటే అది రెవెన్యూ శాఖే అని చెప్పుకొచ్చారు.పరిస్థితులు గతంలోలాగా లేవని గుర్తిస్తే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మానకు చురకలు అంటించారు.అదలా ఉంటే, ధర్మాన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానూ ధర్మాన వ్యాఖ్యలు అధికార పార్టీలో దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖ అవినీతి పేరుకుపోయిందని  స్వయంగా ఆ శాఖ మంత్రే, ‘కితాబు’ ఇస్తే ఇక ప్రభుత్వం తల ఎక్కడ పెట్టుకోవాలని వైసీపీ నాయకులు వాపోతున్నారు.
అంతే కాకుండా, ధర్మాన వ్యవహరం గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించినట్లుందని అంటున్నారు, కృష్ణ దాస్ అనుచరులు. కృష్ణ దాస్ మొదటి నుంచి వైసీపీలో ఉన్నారు. కష్టనష్టాలు అనువించారు. కానీ, ధర్మాన ప్రసాద రావు అలా కాదు. చివరి వరకు కాంగ్రెస్’లో పవర్ అనుభవించి, ఆ తర్వాత ‘అన్న’ పేరు చెప్పుకుని వైసీపీలో చేరారు. చివరకు, అన్న పదవినే కొట్టేశారు. అయినా ఆయనపైనే అవినీతి ఆరోపణలు చేయడం ఏమిటని, ఇది అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టే ధర్మాన దుర్మార్గ నిజానికి అడ్డం పడుతోందని కృష్ణదాసు అనుచరులు అగ్గిమీద్ గుగ్గిలం అవుతున్నారు. నిజానికి, రాజకీయాల్లో ధర్మాన జూనియర్ (ప్రసాద రావు) సీనియర్ అయినా, వైసీపీలో   ధర్మాన కృష్ణ దాస్ సీనియర్. ధర్మాన రాష్ట్రంలో కాంగ్రెస్ కథ ముగిసే వరకు హస్తం పార్టీలోనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చిట్టచివరి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో చివరి రోజువరకు రెవెన్యూ మంత్రిగా కొనసాగారు. కృష్ణదాస్ మాత్రం 2003 ఉద్యోగం వదిలి రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి వైఎస్ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ పాదయాత్రలో పాల్గొని, ఆయన వెంట నడిచారు. ఆ తర్వాత, మంచైనా, చెడైనా జగన్ రెడ్డి వైసీపీ పెట్టినప్పటినుంచి వైసీపీలో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు ధర్మాన వచ్చి అన్నను అవమానించడం ఏమిటని, కృష్ణదాస్ వర్గం ఆగ్రహం వ్యక్త పరుస్తోంది. నిజానికి ఈ విషయం ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లిందని అంటున్నారు. జిల్లాలో అయితే, వైసీపీ ధర్మాన సోదరుల మధ్య రెండుగా చీలిపోయిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇది చివరకు ఎందాక వెళుతుందో అని రాజకీవై వర్గాలో చర్చ జరుగుతోంది. అదలా ఉంటే, ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీలో నివురు గప్పిన నిప్పులలా ఉన్న విబేధాలు,ఎప్పుడైనా, ఎక్కడైనా భగ్గుమనే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.నిజానికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో అధికార వైసీపీలో చోటు చెసుకున్న అంతర్గత విభేదాలు జగన్ రెడ్డి స్థాయిని, పార్టీ మీద ఆయన పట్టును తగ్గించాయని, అంటున్నారు.

Related Posts