YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సొంత సర్వేల్లో నేతలు

సొంత సర్వేల్లో నేతలు

నిజామాబాదం, ఏప్రిల్ 19,
ఇప్పటి వరకు ఆఫ్ లైన్ గుట్టుగా సాగిన సర్వేలు ఇప్పుడు ఆన్ లైన్‌లో జోరుగా కనిపిస్తున్నాయి. రూటు మార్చిన నేతలంతా తాము పోటీ చేయదలచిన నియోజకవర్గంలో ఫెస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం లాంటి మాధ్యమాల ద్వారా తమపై ఓటర్లు ఏమనుకుంటున్నారో తెలుసుకునే పనిలో పడ్డారు. తమ అనుచరుల ద్వార సోషల్ మీడియాలోకి వాటిని వదిలి అక్కడ వస్తున్న స్పందనను గీటురాయిగా మలుచుకునే పనిలో ఉన్నారు. నేతలు తమ అకౌంట్ ద్వారా సన్నిహితులకు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు.సార్వత్రిక ఎన్నికల నగరా మొగనే లేదు.. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు అనేది స్పష్టతనే రాలేదు.. కాని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎన్నికల హడావిడి ముందుగానే వచ్చిందన్న చందంగా ఉంది కోలహలం. జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో జోరుగా సర్వేలు జరుగుతున్నాయి. జనవరిలో ప్రారంభమైన సర్వేలు ఇంకా ముగియనేలేదు. ఇప్పటికే ప్రముఖ సర్వే సంస్థలు మూడు తమ పనిని పూర్తి చేశాయి. గతంలో అధికార పార్టీకి ప్రముఖ సర్వే సంస్థ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే పలువురుకి పలు సూచనలు సలహాలు ఇచ్చారని చర్చ జరిగింది. జిల్లాలో అధికార టీఆర్ఎస్‌తో పాటు బీజేపి, కాంగ్రెస్ పార్టిలు సర్వేలను చేయించుకుంటున్నాయట. అది అన్ లైన్ లో ఆఫ్ లైన్‌లో కోనసాగింది. ఇప్పటికే కొందరు ప్రజాప్రతినిధులు రాబోయే ఎన్నికల్లో తమ భవిష్యత్తును అంచనా వేయడానికి సర్వేలను నమ్ముకున్నారు. ఏకంగా పార్టీల క్యాండిడేట్‌లు ఎవ్వరు అయితే బాగుంటుంది, అతడిపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి... క్యాండిడేట్ ఆర్థిక స్థోమతతో పాటు అతడి గురించి నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు లాంటి అంశాలతో అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.పార్టీలు, ప్రజాప్రతినిధులు చేసుకుంటున్న సర్వేలలో ఉన్న ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు బాగున్నాయా, మీకు ఆ ఫలాలు అందాయా అనే వివరాలు సేకరించడంతో పాటు లోకల్ ఎమ్మెల్యే, ఎంపి ఎలా ఉన్నాడు, క్యాండిడేట్ ను మార్చాలా, మార్చితే ఎవ్వరు అయితే గెలుస్తారు లాంటి ప్రశ్నలను పొందు పరిచి వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పుడు చాలా సామాజిక మాధ్యమాలలో సర్వేలు జరుగుతున్నాయి. ఎన్నికలలో పోటీ చేయాలనుకున్న ఆశవాహులు ఆఫ్ లైన్ కన్న అన్ లైన్ సర్వేను నమ్ముకున్నారు. ఏ పార్టీలో క్యాండిడేట్ కు వ్యతిరేఖంగా కుల సమీకరణలు ఉన్నాయి, క్యాండిడేట్ ను మారిస్తే ఎవరు అయితే బాగుంటుంది లాంటి ప్రశ్నలు వేసి జవాబులను రాబట్టే పనిలో పడ్డారు. ఏకంగా ఒక పార్టీ అయితే క్యాండిడేట్ ల వేటలో పడి ప్రజలు సంబంధిత క్యాండిడేట్‌ల గురించి ఎమనుకుంటున్నారో తెలుసుకునే పనిలో పడ్డారు అని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. కొందరు హైటెక్ లీడర్లు ఇప్పటికే రెండు దఫాలుగా సర్వే చేసుకోని మూడో దఫాగా సర్వేకు సిద్ధపడినట్లు తెలిసింది. ఇప్పట్టో స్థానిక సంస్థల ఎన్నికులు లేకపోగా వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను పరిగణలోకి తీసుకుని తమ జాతకం ఎలా ఉంటుందో అని తెలుసుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సర్వేల గురించి ఆన్ లైన్‌లో మాత్రం జోరుగా చర్చ జరుగుతుంది.

Related Posts