YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

నెల్లూరు,
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  సూచనలమేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు మరియు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను  వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేద మహిళలకు  నగర మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ మరియు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.   అత్యంత కష్టకాలంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలచిన గొప్ప వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని అన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్ల కార్పొరేటర్లు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts