YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు మరో యువకుడు బలి

ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు మరో యువకుడు బలి

హైదరాబాద్
అన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. జియాగుడ కు చెందిన రాజ్ కుమార్ ఆత్మ హత్య చేసుకున్నాడు.  గతంలో రాజ్ కుమార్ ఆన్ లైన్ లోన్ లో 12 వేలు  తీసుకున్నాడు.  ఈ ఎం ఐ ద్వారా 4 వెలు చెల్లించాడు. లోన్ తీసుకునే సమయంలో స్నేహితుల ఫోన్ నంబర్లను రిఫరెన్స్ కాంటాక్ట్స్ గా ఇచ్చాడు. తీసుకున్న మొత్తం చెల్లించకపోవడం తో రాజ్ కుమార్ స్నేహితులకు లోన్ యాప్ నిర్వహకుల మెసేజ్ లు వచ్చాయి. దీంతో మనస్థాపానికి గురైన రాజ్ కుమార్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో  ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. కుల్సుంపుర పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts