YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సైకిల్ పై మంత్రి హరీష్ రావు పర్యటన

సైకిల్ పై మంత్రి హరీష్ రావు పర్యటన

జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నగర బాట లో భాగంగా పలు వార్డు లలో మంత్రి హరీష్ రావు మంగళవారం సైకిల్ పై పర్యటించారు.  క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ స్థానికులు, మహిళలను కలుస్తూ సమస్యలు అడిగి తెలుసుకొని, వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే మాణిక్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్, Tsmsidc ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పార్టీ నాయకులు, జిల్లా, మున్సిపల్ అధికారులు ఉన్నారు.
మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సైకిల్ యాత్ర చేసి ఇంటింటికి వెళ్లి సమస్యలు గుర్తించాము. గీతారెడ్డి రెండు సార్లు గెలిచినా, మంత్రిగా ఉన్నా అభివృద్ధి మాత్రం చేయలేదు. మాటలకే పరిమితం అయ్యారు తప్ప పనులు చేయలేదని అన్నారు.
ఇక్కడి ఎమ్మెల్యే మాణిక్యరావు కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రు. 50 కోట్లు జహీరాబాద్ పట్టణ అభివృద్ధి కోసం మంజూరు చేశారు. గతంలో కూడా జహీరాబాద్ పట్టణం కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. వీటితో ఫోర్ లైన్ రోడ్ లు, బటర్ ఫ్లై లైట్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. ఈరోజు జరిగిన సైకిల్ యాత్రతో ఏ ఏ వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నాయి అని అధికారులతో కలిసి గుర్తించాము. అవసరం అయిన చోట నాలాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోబోతున్నాం. జహీరాబాద్ ఒకప్పుడు నీళ్లు లేక ఇబ్బంది పడ్డ ప్రాంతం మిషన్ భగీరథ వల్ల ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. 19 కోట్లతో పట్టణాల్లో కొత్త పైప్ లైన్ పనులు పూర్తి దశకు వచ్చింది. జహీరాబాద్ పట్టణ ప్రజలకు తాగునీరు పూర్తిగా అందించడం జరుగుతుంది.  రైల్వే బ్రిడ్జి పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించాము. రాబోయే రోజుల్లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటిల్లో సైకిల్ యాత్ర చేస్తాను. సమస్యలు గుర్తించి పరిష్కారం చేస్తాము. రు. 3000 కోట్లతో సంగమేశ్వర ద్వారా గోదావరి నీళ్లను తెలంగాణ లోని అత్యంత ఎత్తైన మోగుడంపల్లికి తెస్తున్నాము. కేసీఆరే వల్లే గోదావరి నీళ్ళు ఇక్కడికి వస్తున్నయి. లక్ష ఎకరాలకు నీళ్ళు అందించ బోతున్నం.  నిమ్జ్  మొదటి ఫేస్ అనుమతి వచ్చింది. డిఫెన్స్ ఫ్యాక్టరీ రాబోతుంది. మరిన్ని కంపెనీలు తీసుకురావడం జరుగుతుంది. మరోవైపు గోదావరి నీళ్ళు వస్తాయి. మొత్తంగా ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకే ఇక్కడి పరిశ్రమల్లో ఉద్యోగాలు దక్కనున్నాయని అయన అన్నారు.

Related Posts