YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

డిస్కమ్ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

డిస్కమ్ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

అమరావతి
 సచివాలయంలో డిస్కమ్ అధికారులతో ఇంధనశాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కమర్షియల్ నష్టాలను తగ్గించేందుకు డిస్కమ్ లు దృష్టి పెట్టాలి. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలన్నదే సీఎం  లక్ష్యం.  సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అందుకు 7వేల మెగావాట్ల విద్యుత్ . ప్రత్యేక డిస్కమ్ ద్వారా వ్యవసాయానికి విద్యుత్.  రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మంది రైతన్నలకు మేలు. చంద్రబాబు హయాంలో విద్యుత్ రంగాన్ని అప్పుల పాలు చేశారు.  అధిక రేట్లకు ప్రైవేటు సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేశారు.  ఈ ఒప్పందాలతో రాష్ట్ర విద్యుత్ రంగం దివాళా తీసిందని అన్నారు.
సీఎం వైయస్ జగన్ నిర్ణయాల వల్ల విద్యుత్ రంగంలో రూ.4925 కోట్ల మేర ప్రజాధనం ఆదా అయింది. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. డిస్కంల పరిధిలో విద్యుత్ నష్టాలు, దుబారాను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ చౌర్యం ను పూర్తిస్థాయిలో అరికట్టాలని సూచించారు . బొగ్గుసరఫరాలో కొరత కారణంగా ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తిస్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేయలేకపోతున్నాయని, దీనివల్ల కొంతమేర విద్యుత్ సరఫరాలో ఆంతరాయాలు ఏర్పడుతున్నాయని అన్నారు. ఇటువంటి సంక్షోభాలను పూర్తిగా ఎదుర్కోవడానికి విద్యుత్ రంగ అధికారులు సన్నద్దంగా ఉండాలని అన్నారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వ్యవసాయరంగానికి అందించే ఉచిత విద్యుత్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఆదేశించారని, దాని మేరకు రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రస్తుత డిస్కమ్ లపై ఆర్థికంగా ఎలాంటి అదనపు భారం లేకుండా రాబోయే 25 ఏళ్లపాటు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ను అందించాలనే ముందుచూపుతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న డిస్కం లకు చేయూత అందించడం,  ఆర్థిక వెసులుబాటును కల్పించేందుకు  ప్రభుత్వం గత 3 ఏళ్లలో అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. విద్యుత్ కొరత ఉన్నప్పటికీ ,  వ్యవసాయానికి పగటి పూట 7 గంటలు, గృహ విద్యుత్ సరఫరా కు ఢోకా లేకుండా విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు.

Related Posts