YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మేనేజ్మెంట్ కోటాలో అవినీతి.. సీపీకి ఫిర్యాదు

మేనేజ్మెంట్ కోటాలో అవినీతి.. సీపీకి ఫిర్యాదు

వరంగల్, ఏప్రిల్ 20,
కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పీజీ సీట్లలో మేనేజ్మెంట్ కోటాలో అవినీతి జరిగిందంటూ వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషికి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. వరంగల్ నగరంలోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలో 33 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 20 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, 4 మైనారిటీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలలో 2300 పీజీ సీట్లు ఉండగా, అందులో మేనేజ్మెంట్ కోటాలో 390 పీజీ సీట్లు ఉన్నాయి. నార్త్ ఇండియా నుండి 45 మంది విద్యార్థులు కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యూయేట్ చేసేందుకు దరఖాస్తు చేసుకోగా వీరికి వివిధ మెడికల్ కాలేజీలో కేటాయించడం జరిగింది. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది ఇతర రాష్ట్రాలలో మెరిట్ ఉండీ ఇక్కడ పీజీ చేస్తామని సీట్ బ్లాక్ చేశారు.దీంతో స్థానికంగా మెరిట్ వచ్చిన విద్యార్థులకు పీజీ చేసే భాగ్యం దక్కకుండా పోతుంది. ప్రైవేట్ వైద్య కళాశాలలపై అనుమానం వచ్చిన కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నేరుగా విద్యార్థులకు పీజీ సీట్ బ్లాక్ చేస్తే చర్యలు తీసుకుంటామని లెటర్స్ రాయడంతో వారు అసలు పీజీ సీట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని ఇదంతా తమకు తెలియదని బదులు ఇవ్వడంతో డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఇతర ఉన్నత అధికారులతో చర్చించి తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరుణ్ జోషి కి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పీజీ సీట్ల బ్లాక్ దందాపై విచారణ చేపట్టారు.

Related Posts