YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఖమ్మం వర్సెస్ ఢిల్లీ

ఖమ్మం వర్సెస్ ఢిల్లీ

హైదరాబాద్, ఏప్రిల్ 20,
యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించిన తెరాస, ఇప్పుడు మరో అంశాన్ని తెరమీదకు తెస్తోది. అఫ్కోర్స్, తెరాసతో యుద్ధానికి సై అంటున్న బీజేపీ నాయకత్వం కూడా, ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధమవుతోంది. యాసంగి ధాన్యం సేకరణ విషయంలో గత నాలుగైదు నెలల్లో తెరాస గల్లీ నుంచి ఢిల్లీ దాకా వివిధ రూపాల్లో,వివిధ స్థాయిల్లో ఆందోళన సాగించింది.అయినా చివరకు చేసేది లేక, కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకునేందుకు సరే అంది. ఒక విధంగా సంధి చేసుకుంది.అయితే, ఆ యవ్వారం ఇంకా అలా సాగుతుండగానే, ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య ఉదంతం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొత్త వివాదానికి తెర తీసింది. జిల్లా మంత్రి, పువ్వాడ అజయ్ ప్రోద్బలంతో పోలీసులు పెట్టిన చిత్ర హింసలు, వేధింపులు  తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సాయిగణేష్ తమ మరణ వాగ్ములంలోనూ అదే విషయం చెప్పారు. 14న పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పురుగులమందు తాగిన సాయి గణేష్  హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ, రెండురోజుల తర్వాత చనిపోయారు. ఈ సందర్భంగా అతను ఇచ్చిన వాగ్ములంలో,  మంత్రి పువ్వాడ ప్రోద్బలంతో అక్రమ కేసులతో ఖమ్మం పోలీసులు తనను వేధిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.  పోలీసుల చిత్ర హింసలు భరించలేకనే, తాను ఆత్మహత్య చేస్కునేందుకు పురుగులమందు తాగినట్లు చెప్పారని బీజేపీ నాయకులు  అంటున్నారు. ఈ ఉదంతం పై గత వారం రోజులుగా ఖమ్మం జిల్లాలో ఆందోళన కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్’ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్  చేయాలని  డిమాండ్ చేస్తున్నాయి. సాయి గణేశ ఆత్మహత్య ఫై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. గత మూడేళ్లుగా ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా అనేక కేసులు, పీడీ యాక్ట్ లు పెట్టి పువ్వాడ వేధిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఇటు ప్రభుత్వం గానీ అటు అధికార తెరాస గానీ, ఈ విషయంలో ఇంత వరకు పెదవి విప్పలేదు. అయితే, మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇదలా ఉంటే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సాయిగణేష్ కుటుంబ సభ్యులు అమ్మమ్మ సావిత్రి,, చెల్లి కావేరితో ఫోన్లో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని, సాయి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆత్మహత్య ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని కేంద్ర హోమ్ మంత్రి హోదాలో షా కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సాయిగణేష్ మృతిపై సీబీఐ విచారణ జరపించాలని కుటుంబ సభ్యులు కోరారు,ఇప్పటికే రాజకీయ పార్టీలు కూడా అదే డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం లేక పోలేదని అంటున్నారు. అటునుంచి అమిత్ షా అలా ఎంటర్ అయితే, ఇటు నుంచి మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ఖమ్మం విషయాన్ని వదిలేసి, ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబందించి, వీహెచ్’పీ, భజరంగదళ్ చేసినట్లు చెపుతున్న వ్యాఖ్యల ఆదారంగా అమిత్ షా పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఈ సంఘటనలకు సబందించి  తమ కార్యకర్తల పై కేసులు పెడితే ఊరుకునేది లేదని వీహెచ్‌పీ, భజరంగదళ్ పోలీసులను హెచ్చరించడాన్ని కేసీఆర్ ట్వీటర్ వేదికగా తప్పు పట్టారు. వీహెచ్’పీ, భజరంగదళ్ చట్టానికి అతీతమా? అని అమిత్ షా’ను ప్రశ్నించారు. నిజానికి హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో రాళ్ళు రువ్వడం వంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్ననేపధ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు వివిధ లౌకిక వాద పార్టీలకు చెందిన 13 మంది జాతీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ, సంయుక్త ప్రకటన విదుదల చేశారు. అయితే, ఎందుకనో గానీ, లౌకికవాద పార్టీలు, అందులో స్టాలిన్, పవార్, మమతా, జూనియర్ సోరెన్  వంటి కేసీఆర్ కలిసొచ్చిన నేతలు అందరూ ఉన్నారు కానీ, కేసీఆర్ లేదు.లౌకికవాద పార్టీలు ఎదుకనో  తెరాసను, కేసీఆర్ ‘ను తమ జట్టులో కలుపుకోలేదు. అది వేరే విషయమే అయినా, దేశంలో రాజకీయాలు హిందుత్వ, హిందూ వ్యతిరేక శక్తుల చుట్టూ తిరుగుతున్న సమయంలో కేంద్ర హోమ్ మంత్రి ఖమ్మంలో బీజేపీ,వీహెచ్’ పీ కార్యకర్త ఆత్మహత్య విషయంలో నేరుగా జోక్యం చేసుకోవడం,అందుకు స్పందనగా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఢిల్లీ సంఘటనను ముడివేసి స్పందించడం చూస్తుంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, బీజేపీ, తెరాసల మధ్య మరో వివాదానికి తెర లేచినట్లే ఉందని పరిశీలకులు అంటున్నారు. అదే నిజం అయితే ఇక అమిత్ షా, కేటీఆర్ వార్ అనివార్యం అనిపిస్తోంది.

Related Posts