YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఒంగోలు ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం

ఒంగోలు ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం

అమరావతి
సీఎం కాన్వాయ్ కోసం తిరుమల వెళ్లే వాహనాన్ని లాక్కోవడంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  సీరియస్ అయ్యారు. ఈ నెల 22న ముఖ్యమంత్రి పర్యటన కోసం భక్తుల వాహనాన్నిఒంగోలు ఆర్టీయే  స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో బాధిత పల్నాడు జిల్లాకు చెందిన కుటుంబం నడిరోడ్డుపై  పడిగాపులు పడింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాన్వాయ్ కోసం వాహనాల బలవంతపు స్వాధీనంపై విచారణ జరపాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశించారు.
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరారు.   మార్గమధ్యంలో బుధవారం రాత్రి సమయంలో ఒంగోలులోని స్థానిక పాత మార్కెట్ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్ చేస్తుండగా ఓ కానిస్టేబుల్ అక్కడికి వచ్చారు  ఈ నెల 22న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంగోలు పర్యటన నేపథ్యంలో.. కాన్వాయ్ కోసం వాహనంతో పాటు డ్రైవర్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు.   తాము కుటుంబంతో తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. కారుతో పాటు డ్రైవర్ను తీసుకుని ఆ కానిస్టేబుల్ వెళ్లిపోయాడు.  బాధితుడు వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ  సీఎం కాన్వాయ్ కు వాహనాలు కావాలంటే స్థానికులను అడిగి తీసుకోవాలనీ, దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న వారి నుంచి, అందునా మొక్కులు తీర్చుకునేందుకు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న వారి వాహనాలు లాక్కుని రోడ్డుపాలు చేయడం ఏమిటని వాపోయారు.   ఊరుకాని ఊళ్లో తమకు ఇప్పటికిప్పుడు తిరుమల వెళ్లేందుకు వాహనం ఎక్కడ దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.   స్వస్థలానికి వెళ్లేందుకు కూడా వాహనం దొరికే పరిస్థితి లేదని ఆవేదన చెందారు.

ఒంగోలు ఘటన సిగ్గుచేటు  చంద్రబాబు :
సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీఏ అధికారులు ఒంగోలులో ప్రజల కార్ లాక్కెళ్ళడం రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమని టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు అన్నారు.  కుటుంబంతో తిరుమల దర్శనానికి వెళ్తున్న వినుకొండ వాసి వేముల శ్రీనివాస్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు బలవంతంగా తీసుకు వెళ్ళడం దారుణం.  భార్యా, పిల్లలతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డున దింపేసే హక్కు ఈ అధికారులకు ఎవరిచ్చారు?  సీఎం కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకు వెళ్ళింది?  ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడడం ద్వారా ప్రజలకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు?  సిఎం వస్తే షాప్స్ మూసెయ్యడం.... సిఎం కాన్వాయ్ కోసం వాహనదారుల కార్లు లాక్కెళ్ళడం సిగ్గుచేటని అయన అన్నారు.

Related Posts