YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మళ్లీ గులాబీ బాస్ యూ టర్న్

మళ్లీ గులాబీ బాస్ యూ టర్న్

హైదరాబాద్ ఏప్రిల్ 21,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మరోసారి, జాతీయ రాజకీయాల విషయంలో  ‘యూ’ టర్న్ తీసుకున్నారా? ఢిల్లీ రాజకీయం అచ్చిరాలేదనే నిర్ణయానికి వచ్చారా? అందుకేనా, ఆయన, ఢిల్లీలో పది రోజులు మకాం తర్వాత, ఏప్రిల్ 11న త్వరలోనే ఢిల్లీ వస్తానని, మోడీ ప్రభుత్వం పై యుద్ధం కొనసాగిస్తానని ప్రకటించి వచ్చినా, ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం హైదరాబాద్’లో నూ అదే చెప్పినా, ఒకటి రెండు రోజులకే మళ్ళీ ఢిల్లీకి అని సొంత మీడియాలో సైతం  వార్తాలు వచ్చినా, గత ఐదారు రోజులుగా ఎలాంటి చప్పుడు లేకుండా, ఫార్మ్ హౌస్’కే పరిమితం అయ్యారా? అంటే, అవుననే మాటే అటునుంచి వస్తోంది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్’ ఎప్పుడు, ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదని, ప్రస్తుతానికి అయితే, కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ప్రత్యాన్మాయ ఫ్రంట్ ఏర్పాటు ప్రతిపాదనను పక్కన పెట్టినట్లే కనిపిస్తోందని అంటున్నారు. అదలా ఉంటే వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్, జాతీయ పార్టీలకు, ప్రాంతీయ ప్రయోజనాలు ముఖ్యం కాదంటూ చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ కొత్త అలోచనలకు అద్దం పట్టేలా ఉన్నాయని అంటున్నారు. నర్సంపేటలో రూ. 43.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కేటీఆర్, అశోక్ నగర్ వద్ద మెగా కంపెనీ ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందుబాటులో వచ్చే విధంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం నర్సంపేట బైపాస్ రోడ్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.ఈ సందర్భంగా కేటీఆర్, తెరాసను ఇంటి పార్టీగా వర్ణించారు. కాంగ్రెస్, బీజేపీలకు దేశంలోని మొత్తం 28 రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం అయితే, తెరాసకు తెలంగాణ ఒక్కటే రాష్ట్రమని,  కోట్లాది సాధించుకున్న తెలంగాణ  రాష్ట్రం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పుకొచ్చారు. అలాగే, ఎట్టికైనా, మట్టికైనా మనవాడే ఉండాలి, మన పార్టీనే ఉండాలననే సామెతలను జోడించి సెంటిమెంట్’ను టచ్’చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణకు తెరాసనే శ్రీరామ రక్ష అంటూ చెప్పుకొచ్చారు. కేటీఆర్ మాట్లాడిన తీరు చూస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనకు కేటీఆర్ చుక్క పెట్టినట్లే కనిపిస్తోందని అంటున్నారు. అయితే, బీజేపీ టార్గెట్’గానే తెరాస భవిష్యత్ వ్యూహం  ఉంటుందని, అందుకే, నర్సంపేట సభలోనూ కేటీఅర్, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీని టార్గెట్ చేశారని అంటున్నారు. అయితే, మే 6న  రాహుల్ గాంధీ వరంగల్’లో పర్యటించనున్న నేపధ్యంలో, ముందు జాగ్రత్తగానూ కేటీఆర్’ ఎవరెవరో వస్తారు ఏవేవో చెపుతారు అటూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.  అయితే, తెరాస ఒక్కసారిగా జాతీయ రాజకీయాల విషయంలో యూ టర్న్ తీసుకోవడానికి, ప్రధానంగా, బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏవీ కేసీఆర్’ ను కాన్ఫిడెన్సులోకి తీసుకోకపోవడం ఒక కారణంగా చెపుతున్నారు. అలాగే, ఎన్నికల వ్యూహకర్త, ప్రశాంత కిశోర్’ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం కావడం కూడా కేసేఅర్ జాతీయ నిరాసక్తతకు మరో కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. పీకే కాంగ్రెస్’లో చేరే పక్షంలో రాష్ట్రంలోనూ ఈక్వేషన్స్ మారే ప్రమాదముంది.అందుకే, కేసీఆర్ ప్రస్తుతానికి జాతీయ రాజకీయాలను పక్కన పెట్టే అలోచన చేస్తున్నారని అంటున్నారు. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో జోష్ తగ్గించారని, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలలో నెలకొన్న గందరగోళం తొలిగే వరకు జాతీయ రాజకీయాలకు కొంత దూరంగ ఉండాలనే లోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.

Related Posts