YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నల్గోండలో ఘరానా మోసం గుట్టు రట్టు పోలీసులు అదుపులో ముగ్గురు నిందితులు

నల్గోండలో ఘరానా మోసం గుట్టు రట్టు పోలీసులు అదుపులో ముగ్గురు నిందితులు

నల్లగొండ
నల్లగొండ జిల్లాలో ఘరానా మోసం బయటపడింది. వ్యవసాయ పనిముట్లు, అనుబంధ ఉత్పత్తులు సబ్సిడీ ఇస్తామంటూ 10 కోట్లు టోకరా వేసిన వైనమిది. ఈ అక్రమ దందా ఎనిమిది నెలలుగా చాప కింద నీరులా విస్తరించింది. వ్యవహారంలో వందలమంది రైతులు మోసపోయినట్లు సమాచారం.  అనుకున్నట్లు ట్రాక్టర్ ట్రాలిలు, రోటవెటర్ లు రాకపోవడంతో బాధిత రైతులు పోలీసులను ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ మిగులు నిధులతో సబ్సిడీ వస్తుందని బాధితులను కేటుగాళ్ళు నమ్మించారు.  చైన్ లింక్ ద్వారా వారంతా మోసపోయారు. తిప్పర్తి మండలం, నూకవారిగూడెం కు చెందిన సైదులును నిందితుడిగా  గుర్తించారుర. గతంలో వాటర్ షెడ్ లో పని చేసిన సైదులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీ లో వున్నాడు. లబ్ది పొందిన రైతులను ఏజెంట్లుగా మర్చి కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన సూత్రదారి సైదులు కోసం  పోలీసు బృందాలు గాలిస్తున్నారు. ఇప్పటికే తిప్పర్తి పోలీసుల అదుపులో ముగ్గురు ఎజెంట్లు వున్నట్లు సమాచారం.

Related Posts