YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పార్టీ కోసం పనిచేసేవారికి గుర్తింపు అచ్చేన్నాయుడు

పార్టీ కోసం పనిచేసేవారికి గుర్తింపు అచ్చేన్నాయుడు

విజయవాడ
తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తయింది.   పార్టీ పట్ల అభిమానం, అమితాసక్తి ఉండి సభ్యత్వం తీసుకోదలచిన ప్రతివారు వారి ఇళ్లవద్దనుంచే సభ్యత్వం తీసుకోవచ్చని  టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు  కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పసుపుసైనికులుఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని గురువారం  చంద్రబాబు ప్రారంభించారు.  ఆధునిక సాంకేతికపరిజ్ఞానాన్ని సభ్యత్వనమోదుప్రక్రియలో భాగంచేయడజరిగింది. పేపర్ లెస్ పరిజ్ఞానంతో కొత్తగా ప్రారంభించిన సభ్యత్వనమోదు నాయకులకు, కార్యకర్తలకు మధ్యవారధిగా ఉండేలా సరికొత్తగా ఆరంభించాము. సభ్యత్వం తీసుకున్నవారి చరిత్రఅంతా కార్డులోనే ఉండేలా, వారిపనితనం వివరాలన్నీ తాజాగా తీసుకొచ్చిన సభ్యత్వనమోదు డిజిటల్ కార్డులో ఉండేలా చేయడంజరిగింది.  పార్టీ కార్యాలయాలచుట్టూ, నాయకులచుట్టూ తిరిగేవారికి భవిష్యత్ లో ఎలాంటిపదవులు ఉండవు.  ప్రజల్లోఉంటూ, వారికష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, అహర్నిశలు పార్టీకోసం శ్రమించే వారందరికీ తగినగుర్తింపు లభించేలా డిజిటల్ సభ్యత్వతీరుతెన్నులు ఉండనున్నాయి.    -సభ్యత్వనమోదు  లాంఛనంగా ప్రారంభించిన చంద్రబాబుగారు తనసభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు.  ఒకపద్దతి, ప్రణాళిక  ప్రకారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించిన ఏకైక పార్టీ దేశంలో తెలుగుదేశం ఒక్కటే.  సభ్యత్వం తీసుకున్నవారికి పార్టీ అన్నివిధాలా అండగా ఉండి సహాయ సహకారాలందిస్తుందని తెలియచేస్తున్నాం.   సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు 5ఏళ్లలో రూ.100కోట్ల వరకు బీమాసహాయం కింద చెల్లించడం జరిగింది.   సభ్యత్వం తీసుకున్నవారికి  బీమాపరిహారంగా రూ.2 లక్షలు చెల్లించడం జరుగుతుంది.   టీడీపీకుటుంబంలో  60లక్షల మంది  సభ్యులుండటం గర్వంగా బావించాల్సిన గొప్ప విషయమని అయన అన్నారు.

పార్టీలో కొందరు నేతల పనితీరుపై చంద్రబాబు హెచ్చరికలు :
టీడీపీ కొందరు నేతల పనితీరు పై చంద్రబాబు మండిపడ్డారు.  క్షేత్రస్థాయిలో పనిచేయకుండా మాయచేసే నేతలకు చెక్ పెడతాని హెచ్చరించారు.  క్షేత్రస్థాయిలో పనిచేయకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.  పనిచేసే వారెవరో పర్యవేక్షించే వ్యవస్థ వచ్చింది.  సీనియార్టీని గౌరవిస్తాం.  సిన్సియార్టీని గుర్తిస్తాం. సీనియార్టీ ఉన్నా ఓట్లు వేయించలేని పరిస్థితి ఉంటే ఏం లాభమని అయన ప్రశ్నించారు.
ఓట్లు వేయించలేని సీనియార్లకే ప్రాధాన్యమిస్తే ప్రతిపక్షంలోనే ఉంటాం.  40 శాతం యువతకు సీట్లిద్దామన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. - తటస్తులనూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.  పార్టీలో పనిచేసే యువ నేతలనూ గుర్తిస్తాం.. అవకాశాలిస్తామని అయన అన్నారు. సమాజ హితం కోసం టీడీపీ అవసరముంది.  అందుకే విరాళాలు స్వీకరిస్తున్నాం.  పార్టీకి విరాళాలు వస్తే కొంతమందికైనా సాయం చేయవచ్చని అయన అన్నారు.

Related Posts