YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

రిలయన్స్‌ జియోకు యూజర్లు షాక్

రిలయన్స్‌ జియోకు యూజర్లు షాక్

ముంబై ఏప్రిల్ 22,
రిలయన్స్‌ జియోకు యూజర్లు షాకిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో జియో భారీగా యూజర్లను కోల్పోయింది. జియోకు 36 లక్షల వరకు కస్టమర్ల సంఖ్య తగ్గిపోయింది. జియో నే కాకుండా వొడాఫోన్‌ ఐడియా కూడా భారీగా కస్టమర్లను కోల్పోయింది. ఈ కంపెనీ దాదాపు 15 లక్షల వరకు కస్టమర్లను కోల్పోయింది. టారిఫ్‌ ధరల పెంపే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జియో, వొడాఫోన్‌ ఐడియాలకు కస్టమర్ల సంఖ్య తగ్గడం ఇది మూడో నెల. ఇందుకు ఫిబ్రవరికి సంబంధించిన టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా వివరాలను వెల్లడించింది. దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీ జియో సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 40.2 కోట్లుగా ఉంది.అలాగే వొడాఫోన్‌ ఐడియా సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 26.45 కోట్లుగా ఉంది. జనవరి నెలలో జియో 93 లక్షలు, వొడాఫోన్‌ ఐడియా 3 లక్షల చొప్పున కస్టమర్లు తగ్గిపోయారు. అయితే టెలికం కంపెనీలు నవంబర్‌ చివరి నాటికి ప్రీపెయిడ్‌ ప్లాన్‌లలో 20 శాతం సుంకాన్ని పెంచాయి. రెండో సిమ్‌ కార్డును రీచార్జ్‌ చేసుకోవడం తగ్గించారని టెలికం నిపుణులు చెబుతున్నారు.ఇక డిసెంబర్‌లో కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగింది. జియో 1.3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. ఇక ఎయిర్‌టెల్‌ మాత్రం దూసుకుపోయింది. ఫిబ్రవరి నెలలో 16 లక్షల మేర యూజర్లను పెంచుకున్నట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) నివేదికలో వెల్లడైంది. ఇక ఫిబ్రవరి చివరి నాటికి ఎయిర్‌టెల్‌ కస్టమర్ల సంఖ్య 35.8 కోట్లుగా ఉంది. ఇక నెలవారీ ప్రాతిపదికన చూస్తే మొత్తంగా దేశంలో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 37 లక్షల మేర తగ్గింది. 114.5 కోట్ల నుంచి 114.41 కోట్లకు క్షీణించింది. మార్చి నెలలో కూడా ఇదే తీరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Related Posts