YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కౌలురైతులకు రక్షణ, రైతుసంక్షేమ పథకాల అమలు చేయండి

కౌలురైతులకు రక్షణ, రైతుసంక్షేమ పథకాల అమలు చేయండి

హైదరాబాద్ ఏప్రిల్ 22
రైతు రుణమాఫీ మరియు కౌలురైతులకు రక్షణ, రైతుసంక్షేమ పథకాల అమలు ప్రజా సంగ్రామ యాత్ర రెండవ విడత పాదయాత్రలో అనేక మంది రైతులు నన్ను కలిసి అర్జీలు ఇచ్చారు. వీటిని పరిష్కరించాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్‌ కూరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కు లేఖ రాసారు.గత ఏడు రోజులుగా ఏ గ్రామానికి వెళ్ళినా వందలాది మంది రైతులు నావద్దకు  వచ్చి రైతురుణమాఫీ జరుగలేదని తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ముఖ్యంగా రైతురుణమాఫీ జాప్యం, రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది కౌలురైతులకు ఎటువంటి రక్షణ లేకపోవడంపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుండి రైతాంగం పొందే ఎటువంటి లబ్ది కూడా కౌలురైతులకు అందకపోవడం విచారకరం. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తీసుకురాదలచాం.2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతులకు వున్న కూడా బకాయిలను రద్దు చేస్తామని టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. ఈ నాలుగేండ్ల కాలంలో 20,164.20 కోట్లు కేటాయించినట్లు గొప్పలు చెప్పినా అందులో ప్రభుత్వం విడుదల చేసింది కేవలం 1,144.38 కోట్లు మాత్రమే.  దీనివల్ల 5.66 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగగా దాదాపు 31 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు.25 వేల లోపు రుణమాఫీ కావాల్సిన రైతులు 2.96 లక్షలు ఉండగా వారికి రుణమాఫీ కావాల్సింది రూ.408.30 కోట్లు, 25 వేల నుండి 50 వేల లోపు రుణమాఫీ కావాల్సిన రైతులు 5.72 లక్షలు ఉండగా వారికి రుణమాఫీ కావాల్సింది రూ.1,790 కోట్లు, 50 వేల నుంచి 75 వేల లోపు రుణమాఫీ కావాల్సిన రైతులు 7 లక్షల మంది ఉండగా వారికి రుణమాఫీ కావాల్సింది రూ.4 వేల కోట్లు, 75 వేల నుండి ఒక లక్ష వరకు రుణమాఫీ కావాల్సిన రైతులు 21 లక్షలమంది ఉండగా వారికి రుణమాఫీ కావాల్సిది రూ.13 వేల కోట్లు. మొత్తంగా 36.68 లక్షలమంది రైతులకు 19,198.38 కోట్లు ప్రభుత్వం రుణమాఫీ చేయాల్సింది ఉంది.50 వేల లోపు రుణమాఫీ కావాల్సిన రెండు లక్షలమంది రైతులకు సంబంధించిన రూ.857కోట్ల బిల్లులు ప్రభుత్వానికి సమర్పించినా ఆర్థికశాఖ పెండిరగ్‌లో పెట్టడం వల్ల రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు అందింనంత వరకు  ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసేవిధంగా ప్రభుత్వం ఆదేశించాలని బిజెపి డిమాండ్‌ చేస్తోంది. మిగిలినవారికి వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.  ప్రభుత్వం నుండి లబ్దిదారుల అకౌంట్లల్లో పడే సంక్షేమపథకాల డబ్బును రుణమాఫీ బకాయిలకు బ్యాంకులు జమ చేసుకుంటున్నారు. దీంతో చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి సంక్షేమపథకాల డబ్బును రుణమాఫీ బకాయిలకు జమచేసుకోకుండా ఆదేశించాలని వారిని కోరాలి. భూ యజమానుల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లకుండా రాష్ట్రాలు కౌలుచట్టాల్లో మార్పులు చేసుకోవాలని 11వ పంచవర్ష ప్రణాళిక పేర్కొంది. కౌలు చట్ట సవరణ అంటే భూయజమానికి, కౌలుదారులకు భరోసా కల్పించేవిధంగా సవరణలు ఉండాలని ఆ నివేదికలో స్పష్టం చేశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కౌలుదారులకు ఎటువంటి హక్కులు కల్పించకపోగా వారిని కనీసం రైతులుగా గుర్తించడానికి కూడా నిరాకరించడం గర్హనీయం. పావలా వడ్డీ రుణాలు కౌలుదారులకు ఇవ్వవచ్చని నాబార్డు సూచించింది.  కౌలువ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న చిన్న సన్నకారు రైతులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూపుతున్న వివక్ష క్షమించరానిది. అవసరమైతే కొత్తచట్టాలను తీసుకరావటం లేదా వున్న చట్టాలలో సవరణలు తెచ్చి కౌలురైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వున్నది.పెండిరగ్‌లో వున్న రైతురుణమాఫీ బకాయిలను వెంటనే చెల్లించటంతోపాటు కౌలురైతుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని బిజెపి డిమాండ్‌ చేస్తుంది. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘాలతో, అన్ని రాజకీయపార్టీలతో వెంటనే ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బిజెపి తరుపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు.

Related Posts