YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ తీరు పై మండిపడ్డ హైకోర్టు

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ తీరు పై మండిపడ్డ  హైకోర్టు

అమరావతి ఏప్రిల్ 22
ఉద్యోగుల బదిలీకి సంబంధించి ప్రభుత్వ తీరు పై ఏపి హైకోర్టు మండిపడింది. తమకు తెలీకుండా హైకోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం ఎలా బదిలీ చేస్తుందని చీఫ్ జస్టిస్ ప్రశాంత్ మిశ్రా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కొంతకాలంగా ఏదో విషయంలో ఇటు ప్రభుత్వానికి అటు హైకోర్టుకు మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. హైకోర్టులో డిప్యుటేషన్ పై పనిచేస్తున్న ఏపీ పరిపాలనా ట్రైబ్యునల్ ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక్కడే ప్రభుత్వం పై ప్రధాన న్యాయమూర్తి మండిపోయారు.విషయం ఏమిటంటే హైకోర్టులో ఉద్యోగాల కొరత తీవ్రంగా ఉంది. అందుకనే  ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ ను రద్దు చేసిన తర్వాత అందులో ఉన్న ఉద్యోగులందరినీ ప్రభుత్వం హైకోర్టుకు డిప్యుటేషన్ మీద బదిలీ చేసింది. ఇపుడు మళ్ళీ డిప్యుటేషన్ పై పనిచేస్తున్న 70 మంది ఉద్యోగుల డిప్యుటేషన్ రద్దుచేసి  హైకోర్టు నుండి బదిలీ చేయాలని ప్రక్రియ మొదలు పెట్టింది.  దీన్ని హైకోర్టు లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన లిటిగేషన్ (పిల్)దాఖలు చేశారు.ఈ పిల్ ను విచారించిన సందర్భంగానే ప్రభుత్వం తీరుపై హైకోర్టు చీఫ్ జస్టిస్ మండిపోయారు. హైకోర్టు సామర్ధ్యానికి తగ్గట్లుగా ఉద్యోగులు లేక అవస్థలు పడుతుంటే డిప్యుటేషన్ పై ఉన్న ఉద్యోగులను కూడా మళ్ళీ బదిలీ చేయడం ఏమిటంటు నిలదీసింది.
ఏపీ హైకోర్టుకు మంజూరైన పోస్టులు 990 అయితే ఇపుడు పనిచేస్తున్నది కేవలం 365 మంది మాత్రమే అని చెప్పారు. అలాంటిది డిప్యుటేషన్ పై వచ్చిన ఉద్యోగులను బదిలీ చేస్తే ఎదురయ్యే సమస్యలను తెలుసుకోకుండా ఏకపక్షంగా బదిలీ చేయడం ఏమిటని నిలదీసింది.
హైకోర్టులో డిప్యుటేషన్ పై పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీచేయాలని ప్రభుత్వం అనుకున్నపుడు ముందుగా తమతో సంప్రదించచుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. పూర్తిస్ధామర్ధ్యానికి గాను హైకోర్టు 40 శాతం సిబ్బందితోనే పనిచేస్తున్న విషయం ప్రభుత్వానికి తెలుసా ? అంటు అడిగారు.ఈ విషయమై అడ్వకేట్ జనరల్ మాట్లాడుతు బదిలీ ప్రక్రియ విషయంలో గతంలోనే హైకోర్టు రిజిస్ట్రీని లేఖ ద్వారా సంప్రదించినట్లు చెప్పారు. అయితే అడ్వకేట్ జనరల్ వాదనను హైకోర్టు పట్టించుకోలేదు. మొత్తం మీద బదిలీ ప్రక్రియను హైకోర్టు నిలిపేసింది.

Related Posts