YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు దూషించారని నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటాం...

చంద్రబాబు దూషించారని నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటాం...

బద్వేలు
తన రాజకీయ చరిత్రలో ఏనాడైనా ఏ వ్యక్తి నైనా తెదేపా అధినేత,ప్రధానప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు అసభ్య పదజాలంతో దూషించారా? అని సూటిగా ప్రశ్నిస్తూ...విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మానసిక పరిపక్వత లేని,సరిగా మాట్లాడటం చేతగాని ఆడబిడ్డనూ పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు నన్ను అసభ్య పదజాలంతో దూషించారనటం సిగ్గుచేటని దమ్ము,ధైర్యం ఉంటే దీనిని నిరూపించాలని, నిరూపిస్తే మేమందరం శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటామని మహిళా కమిషన్ చైర్ పర్సన్  వాసిరెడ్డి పద్మ కు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి(వాసు),తేదేపా కడప పార్లమెంటు అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి,తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, తేదేపా బద్వేలు నియోజకవర్గ బాధ్యుడు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ లు సవాల్ విసిరారు బద్వేలు పట్టణంలోని తేదేపా నియోజకవర్గ కార్యాలయంలో తేదేపా అగ్రనేతలు శనివారం ఉదయం విలేకరులతో మాట్లాడుతూ.....
విజయవాడ నడిబొడ్డులో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లో మానసిక పరిపక్వత లేని మహిళను తీసుకువచ్చి ముప్పై గంటల ఆసుపత్రి గదిలో బంధించి ముగ్గురు వ్యక్తులు మానభంగం చేశారని, ఈ దుర్ఘటన రాష్ట్రానికి అవమానకరమని వారు ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు ఇలాంటి సంఘటన పై  వాసిరెడ్డి పద్మ ను చంద్రబాబు ప్రశ్నిస్తే,నిలదీస్తే దానికి సమాధానం చెప్పకుండా మీరు రాజకీయం చేయడానికి వచ్చారా? అని రెచ్చగొట్టి వాగ్వాదానికి దిగి,మళ్ళీ చంద్రబాబు,మాజీ మంత్రి బోండా ఉమా లు తనను అసభ్య పదజాలంతో దూషించారని నోటీసు ఇవ్వడం చూస్తుంటే "మొగుణ్ణి కొట్టి జాన - మొగసాల కెక్కినట్టు" ఉందని వారు ఎద్దేవా చేశారు ఈ దుర్ఘటనపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ,పోలీసు అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదని వారు విశదీకరించారు

Related Posts