YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ రాజకీయాల్లోకి ఆంధ్రా ఆక్టోపస్

మళ్లీ రాజకీయాల్లోకి ఆంధ్రా ఆక్టోపస్

విజయవాడ, ఏప్రిల్ 25,
ఆంధ్రా ఆక్టోపస్‌ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారా? నాలుగేళ్లుగా పత్తాలేని లగడపాటి ఇప్పుడు సడన్‌గా తెరపైకి వచ్చారు. నందిగామలో ఓ వివాహ వేడుకకు హాజరైన లగడపాటి.. ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో భేటీ అయ్యారు. డైనింగ్‌ టేబుల్‌పై ఆసక్తికర చర్చలు సాగినట్లు తెలుస్తోంది. ఏపీలో రాజకీయాలతోపాటు.. ఇటీవల కేబినెట్‌లో జరిగిన మార్పులపైనా చర్చించినట్లు సమాచారం. 2014 తర్వాత పాలిటిక్స్‌కి దూరంగా ఉంటున్న లగడపాటి ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.మర్యాదపూర్వకంగానే ఈ భేటీ సాగింది అంటున్నారు వసంత కృష్ణప్రసాద్‌. ఆప్యాయ పలకరింపులే కాని.. రాజకీయ చర్చలు తమ మధ్య రాలేదంటున్నారు. కానీ.. ఆయన అనుచరులు మాత్రం.. పొలిటికల్ మంత్రాంగం జరిగినట్టు చెప్తుండడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ భేటీ తర్వాత ఆయన ఖమ్మం బయల్దేరి వెళ్లారు. ఖమ్మంలో ఓ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే ఇప్పటికే ఖమ్మంలో కమ్మ పాలిటిక్స్‌ రాజుకోవడంతో.. ఆయన కార్యక్రమం కూడా ఆసక్తికరంగా మారిందిమరోవైపు లగడపాటి రీఎంట్రీ ఇస్తే.. ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీలోకి వస్తే.. ఆయనకు విజయవాడ సీటు గ్యారెంటీగా కనిపిస్తోంది. గతంలో విజయవాడ నుంచి వైసీపీ సీటుపై పోటీ పోటీచేసిన పీవీపీ ఇప్పుడు సైలెంట్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారన్నదానిపై ఇంట్రెస్టింగ్‌ టాక్‌ నడుస్తోంది. ఇప్పుడు లగడపాటి ఎంట్రీతో ఆయనకు ఆ సీటు ఇస్తారా అనే విషయం కూడా తెరపైకి వచ్చింది.ఇదిలావుంటే, ఖమ్మంలో కమ్మరాజకీయం సెగలు రేపుతోంది. కమ్మ లీడర్ల మధ్య యుద్ధం ఓ రేంజ్‌కి వెళ్లింది. పువ్వాడ అజయ్‌ కామెంట్స్‌ని వక్రీకరించారని మండిపడ్డారు ఖమ్మం టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు. రేణుకాచౌదరి కమ్మ సామాజికవర్గాన్ని అడ్డంపెట్టుకుని మంత్రి పదవులు అనుభవించారన్నారు. ఆమె ఖమ్మం పట్టణానికి గాని.. కార్యకర్తలకు గాని చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఈరోజు మీడియా ముందు వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కమ్మ కార్పోరేటర్లు.. రేణుకచౌదరిపై విమర్శలు చేశారు.

Related Posts